నేడు మాతృభాషా దినోత్సవ సందర్భంగా=========================================
తల్లిదండ్రుల్ని ప్రేమించడం ఎంత ముఖ్యమో మాతృదేశాన్ని, మాతృభాషను ప్రేమించడం కూడా అంతే ముఖ్యం. భారతీయ భాషలలో తెలుగుకు ఒక విలక్షణమైన స్థానం ఉంది. మన మాతృభాష తెలుగు. తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుగువారే కాదు భారతీయులందరూ గుర్తించారు. అచ్చులతో అంతమయ్యే పదాలు అధికంగా ఉన్న భాష కాబట్టి వినడానికి సొంపుగా ఉంటుంది. అందుకే ఇటలీ భాష కూడా అజంతా భాషే. 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'అని తెలుగును పాశ్చాత్యులు కీర్తించారు. ఇంతే కాదు ఎన్నో పాటలు, పద్యాలు, సామెతలు, పొడుపు కథలు ఉన్న తెలుగులో తొలితా విద్యార్థులు ప్రావీణ్యం సాధిస్తే ఇట్లే సులభంగా నేర్చుకోవచ్చు. అందుకే మాతృభాషను'తల్లి'పాల వంటి ది అంటారు.
తెలు గాదేల యన్న ? దేశంబు తెలు గేను/
తెలుగు వల్లభుండ తెలుగొ కండ/
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి/
దేశభాషలందు తెలుగు లెస్స.
ఒక మాటు కనుమోడ్చుచుండు బొమ్మెర వారి
మందార మకరంద మధుర వృష్టి/
ఒక మాటుముర్కొనుచుందు తిమ్మన గారి పారిజాత వినూత్న పరిమళం.
ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమ
నర్ది విహరించు ఆంధ్ర విద్యార్థి నేను.
తెలుగు భాష యొక్క తీయందనాన్ని ప్రతి విద్యార్థి చదివి తీరాలనే సూచన చేసినారు.
తెలుగు భాష అంటే అమ్మ భాష.
తేనె కన్నా తీయనైనది.
అమ్మానాన్న అని పిలుచుకునే ముద్దు భాష మనది.
భాషను గౌరవిద్దాం. భాషను బ్రతికించుకుందాం. మన మాతృభాషలోనే మాట్లాడుకుందాం. ఏ దేశమేగినా మరువకూడదు రా మన తెలుగు భాషను.
మాతృభాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.
భారతీయ భాషలలో తెలుగు వైశిష్టం.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి