"భూతల స్వర్గం"; - కొప్పరపు తాయారు

 నిను మెచ్చిన వారు,
నీకై పరితపించువారు,
నీదు సౌభాగ్యం అందరి అదృష్టం అని ఎంచువారు,
నీదు ప్రగతి కాంక్షించువారున్న భువిస్వర్గము కాక వేరొoడు కాదు
దివికేగ అవసరమేమి ఇల సర్వ  సుఖములుండ,
భగవంతుడు దీవీంచి యిచ్చె
భూతలస్వర్గము నీమనసు నందు,
నీ చేతలోన నిబిడీకృతమైనది,
మనసు పంచి,మమతలు పెంచు
మనుగడ మనిషి,మనిషికీ,భావాల
బాంధవ్యం మహనీయం, పవిత్రమైన బంధం.
తల్లిలా కాచు తరుణి,ఆపదలో కాపాడు వనితయైన,ఎవరైనను అనుంగు బంధువులే,
సేదదీర్చి బాధ తెలిసిన ప్రాణం,
కడుపు నింపే కమనీయమైన హృదయం కార్చిచ్చును కూడా కడతేర్చు.
భావాలలోపం మమతల మధుర
సౌరభాలు లేని హృదయం కఠినతరం.
కంటి నీరు తుడిచి కడవరకు నిలుచు.
ఆశించక,కోరక,సుతిమెత్తని,సునిశిత భావాలతో,
అంతరంగాలు చదువనేర్చిన ఈ భువి అంతయు నిండు భందువులతోడ,
వారూ,వీరూ లేదు అందరూ మనవారే అదే మనుగడకి మహా భాష్యం,
అందుకే పంచుదాo,పవిత్రమైన ప్రేమాభిమానములు అందరికీ,
చేసుకుందాం జీవనాన్ని ఇల స్వర్గధామం.
కామెంట్‌లు