@ కోరాడ మినీలు @
  @ వీడని బంధం @
             *****
బంధాలన్నీ... ఒకటికొకటిగా 
వీడి  పోయేవే.... !
 ఒకింతఎక్కువకాలంకలిసుండి
  చివరకు వివాహబంధమూ... 
          వీడి పోయేదే.... !!
   జన్మ - జన్మలకూ వీడక..... 
   వెంటబడి వచ్చే బంధం...., 
   పాప - పుణ్యముల కర్మఫలం 
           ******
       @  ముక్తి మార్గం @
              ****
" దుష్కర్మ " ఇనుపసంకెల ఐతే 
" సత్కర్మ " స్వర్ణ సంకెల.... !
   కర్మలేవైననూ సంకెలలే కదా 
   సంకలలలో స్వేచ్ఛ, శాంతి, సుఖము సాధ్యమా.... !?
    కర్మ రహితమే ముక్తి మార్గం 
        ******
         * జీవన్ముక్తి *
           ****
నదిలో నావే జీవితం.... !
నావలోకి నీరు రానంతవరకే 
 ఆనందం... !సంసారంలో నువ్వున్నా, నీలోకి సంసారం రానంతసేపూ ఆనందమే... !
 నీలోకి సంసారం వచ్చి చేరిందో 
    అంతా గంద

రగోళమే.... !
  ముక్తి కంటే జీవన్ముక్తి.... 
                 గొప్పదికదూ....!!
      *****
కామెంట్‌లు