పాపం పండాలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకసారి నారదుడు క్షీరసాగరానికి వెళ్లాడు. విష్ణుమూర్తి దీర్ఘాలోచనలో ఉన్నాడు."దేవా!మీచింతకి కారణం?""ఏంచెప్పేది నారదా!కంసుని అత్యాచారాల చిట్టా పెరుగుతోంది. వాడి పాపం ఎప్పుడు పండుతుందా అని ఆలోచిస్తున్నాను. దేవకి 8వసంతానం వాడిని చంపుతుంది అని తెలుసుకుని అందుకే కాచుకుని ఉన్నాడు."నారదుడు ఇలా అన్నాడు " దేవా మీరేమీ బాధ పడకండి. నేను చూస్తాను " అని కంసుని దగ్గరకు వెళ్లాడు.కాసేపు ఆకబురు ఈకబురూ చెప్పి "కంసరాజా! నీవు బాగా మాయలో ఉన్నావయ్యా!దేవకి 8వ సంతానం వల్ల నీకు ప్రాణహాని ఉంది అని భావిస్తున్నావు.కానీ అందరినీ గుండ్రంగా కూచోపెడితే ఎటు నించి లెక్కపెట్టినా 8వ సంఖ్య ఎవరికి వస్తుందో చెప్పలేము కదా?కాబట్టి పుట్టిన వీరందరినీ సంహరించు" అని సలహా ఇచ్చాడు. అలా కంసుడు వారిని చంపి పాపం మూటకట్టుకున్నాడు.ఆఖరికి కృష్ణుని చేతిలో హరీ అన్నాడు. 🌹
కామెంట్‌లు