శతక సందేశ మాధుర్యం.; - తాటి కోల పద్మావతి గుంటూరు.

 50 సంవత్సరాల వెనక్కి వెళితే, నాటి వాళ్లకు శతకాలపై వల్లమాలిన అభిమానం. శతక పద్యాలు ఏ కొన్ని వాళ్లు తప్పక అప్ప చెప్ప గలిగేవాళ్లు. కనీసం వేమన, సుమతి, కృష్ణ శతకాలు ఇళ్లలో ఉండేవి. భర్తుహరి, భాస్కర, నృసింహ, దాశరధి శతకాలను తరచుగా చదువుకునే వాళ్లు.
శతకాలలో హితబోధ ఎక్కువ. అవి కర్తవ్యాన్ని హెచ్చరించేవి. జీవిత వాస్తవాలను తెలిపేవి. దాన, ధర్మ దయ మార్గాలను నిర్దేశించేవి. ఉత్తమ శీల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేవి. భక్తి పారవశ్యాన్ని మాధురీథురీణంగా ప్రకటించేవి. ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు అందించే సారాంశం ఒక్క శతకాల మూలంగానే పాఠకులు పొందేవారు.
గువ్వలచెన్ను ని శతకంలో వదన్యతను గూర్చిన పద్యం ఒకటి.
కలిమిగల లోభికన్నను
విలసితముగ పేద మేలు వితరణి యైనన్
చలి చెలమ కాదా!
కుల నిధి అంబోధికన్నా గువ్వల చెన్న.
దండిగా ధనం ఉండి కూడా దానం చేయనివాడు ఉప్పునీటి సముద్రం వంటి వాడట! ఉన్నంతలో ఎదుటివారిని సంతృప్తి పరచేవాడు చన్నీటి చలమ లాంటి వాడట! ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగం దానానికి కేటాయించాలి అన్నది హైందవ ధర్మం. ఈ నీతిని మనసుకు పట్టించడానికి చక్కని దృష్ట్యాంతాన్ని ఎన్నుకొనండి పై పద్యం.

కామెంట్‌లు