భీష్మ పితామహుడు .;-;- తాటి కోల పద్మావతి గుంటూరు
భీష్మ పితామహుడు.
శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి.
గంగా పుత్రుడు సత్యవతీ తనయుడు.
తండ్రికిచ్చిన మాట ప్రకారం
వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి
ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్మ పితామహుడు.
శ్రీకృష్ణ భగవానునికి ప్రీతిపాత్రుడు.
వాత్సల్యం, భగవద్భక్తి మూర్తిభవించిన గుణశీలాలే కారణం.
పితృభక్తికి, శౌర్య సంపదకు
రాజ్యాధికారాన్ని స్వచ్ఛంగా వదులుకొని
యుద్ధ రంగంలో సమస్త యోధులకు శిరోమణి.
ధనుర్తులకు బాసటగా నిలిచి
సూరత్వంలో ఇంద్రసమానుడై
స్థిరత్వంలో హిమాలయాల వలె నిలిచి
సముద్రమంతటి గంభీరత్వం
పృద్వి అంతటి సహనశీలుడు.
లక్షలాది మందిని సైనికులను సంగ్రామంలో సంహరించి, శ్వేత కాంతితో చంద్రుని వలె ప్రకాశించి భీష్మ పితామహుడు.
ధైర్యం బుద్ధి కుశలత పరాక్రమంతో, ఈరోజు తన లక్షణాలు గల పరాక్రమవంతుడు.
శరీరమంతా శరాఘాతిలతో అంప శె య్య పై ఉండి, విష్ణు సహస్రనామాలతో మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వచ్ఛంద మరణం వరంగా పొందినవాడు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో, మాఘ శుద్ధ అష్టమి మొదలు ఏకాదశి వరకు ఐదు రోజులు, రోజుకు ఒక్క ప్రాణం చొప్పున ప్రాణాలను వదిలిన రోజే భీష్మ ఏకాదశి.
పంచకం అనే నామంతో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ ని అనుగ్రహానికి పాత్రుడై నేలకొరిగిన శ్వేత కవచధారి.
భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ పితామహునకు అర్పించే తర్పణాలు ఎంతో పవిత్రమైనవి.


కామెంట్‌లు