మన దురదృష్టం ఏమిటో గాని పలు ప్రభుత్వాలు ప్రాధమిక స్థాయి నుండి మాతృభాషలో విద్యాబోధన పక్కన పెట్టి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. తాజాగా కర్ణాటక ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ చర్యల వలన విధ్యార్ధులు ఎంతో కోల్పోతారన్నది సుస్పష్టం.
1964-66 నాటి కొఠారి కమిషన్ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది. జ్ఞానార్జనకు మాతృభాష చక్కని పునాదిగా నిలిస్తుంది. విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడంచడానికి మాతృభాష తోడ్పడినంతగా మరే ఇతర భాషా అనుకూలం కాదు. మాతృభాషాభిమానం దేశాభిమానానికి ప్రథమ సోపానం.
శువు తాను పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులు మరియు ఇరుగుపొరుగు వారి నుండి ఏ భాషను వింటూ, ఏ ఇబ్బంది లేకుండా తన్మయత్వంగా నేర్చుకుంటూ ఉంటాడో, ఆ భాషను మాతృభాషగా పరిగణించవచ్చు. మనం మొట్టమొదట నేర్చుకునేదీ, బాగా ఎక్కువగా మాట్లాడేదీ, ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ, భావావేశ, లేదా హృదయా నుగత సంబంధం కలిగినదీ, లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోంది.
ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదవ తరగతి వరకు మాతృభాష లోనే బోధన జరగాలి అని చెబుతోంది.
పిల్లలు మరింత మెరుగ్గా తొందరగా అవగాహన చేసుకొని నేర్చుకుంటారు . పాఠశాలలో ఎ.క్కువగా గడపడాన్ని పిల్లలు ఆనందిస్తారు. పిల్లలలో అత్మనిబ్బరం పెరుగుతుంది మాతృ బాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం సులభం.
మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి.
మాతృభాషలో విద్యాబోధనతోనే మానసిక వికాసం జరుగుతుంది. ఏ భాషను వింటూ విద్యార్థి నవ్వుతాడో, ఏ భాష అయితే ఇంటి భాష అవుతుందో అందులో చెప్పినప్పుడే విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక వికాసంలో కీలక పాత్ర వహిస్తుందన్నారు.
ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో! ఈ విషయాల్ని మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాబోధనా పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు కూడా ఆ దిశలోఆలోచించాలి.
సి హెచ్ ప్రతాప్
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
MOBILE no : 95508 51075

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి