భారతీయ సంస్కృతికి మూలం అయిన పురాణాలలో ఎందరో మహర్షులు మనకు కాన వస్తారు. వారిని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పురాణాలలోకి వెళ్ళవలసినదే. అయితే బాలలకు కనీస ఋషి పరిజ్ఞానం కలుగజేయడం కోసం ఇక్కడ కొంతమంది ఋషుల గురించి తెలియజేయడం అయినది.
అగస్త్య మహర్షి-వశిష్ఠుడు: వీరిరువురు సోదరులు. వీరికి "కుంభ సంభవులు","కలశజులు", మిత్రా వరుణ పుత్రులు", ఔర్వసేయులు అని పేర్లు. నార నారాయణులలో ఒకరైన నారాయణ మహర్షి యొక్క తొడ నుండి ఊర్వసి ఉద్భవించింది. ఊర్వశిని చూచి సూర్యుడు, వరుణ దేవుళ్ళు మోహించారు. అలా మోహించిన ఆ సూర్యుడు వరుణుడు తమ మోహాన్ని ఒక కలశం లో పెట్టి వెళ్ళిపోయారు. అందులో నుండే కొంతకాలమునకు అగస్త్యుడు , వశిష్ఠుడు ఉద్భవించారు. కలశము నుండి పుట్టారు కాబట్టి"కలశజులు"అని సూర్య, వరుణుల మోహం వలన పుట్టారు కాబట్టి మిత్ర వరుణులు అని, ఊర్వసి కారకురాలు కాబట్టి ఔర్వసేయులు అని పేరు వచ్చింది.
ఋషులు వివరములు.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి