నామ ధారణ వల్ల విభూది ధారణ గుణాలే ప్రాప్తిస్తాయి. నామం ఒక విధమైన మన్నుతో చేయబడుతుంది. అలాంటి పవిత్రమైన మన్ను ధరించడం వల్ల శరీర ఉష్ణాంశం సమంగా ఉంటుంది. ఎక్కువగా ఉండే ఉష్ణాన్ని పీల్చుకుంటుంది. అందువల్ల శరీరం లోపలి అంగాలు-హృదయం, శ్వాసకోశాలు మొదలైనవి తమకు కావాల్సిన ఉష్ణాంశాన్ని స్వీకరిస్తాయి.
శ్రీగంధం-ఇది కూడా శరీర ఉష్ణాన్ని కాపాడుతుంది. మంచి వాసన ఉండటంతో శరీర దుర్గం థం పోగొడుతుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రక్త దోషాన్ని హరిస్తుంది. దప్పికను నియమిస్తుంది. విషక్రీమూల్ని హరిస్తుంది. హృదయ తాపాన్ని తగ్గిస్తుంది. చల్లదనాన్ని ఇస్తుంది. కండ్లకూ, శరీరానికీ కాంతిని చేకూరుస్తుంది. చర్మ రోగాన్ని తొలగిస్తుంది. గాయాలు మాన్పుతుంది. శరీరానికి బలాన్ని, తేజస్సును కలిగిస్తుంది.
నామ ధారణ-- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి