హరహర అని జలజల గంగపారంగ
నెలవంక నవ్వంగ
మేమిద్దరం మాకు ఇద్దరంటూ
గౌరి సగమై ఉండంగా
బుస్ మనే పాముకి మయూరి
హెచ్చరిక చేయంగా
నందీశ్వరుని మూషికరాజుని
సమదృష్టితో చూడంగ
సృష్టి అంతా ఓంకారం
ఆద్యంతాలు లేని స్వరూపం
లయంలోనే ఉంది సర్వం
జీవుల బ్రతుకు క్షణభంగురం
వసుధైక కుటుంబం మాది
చాటు పరమేశ్వరుని తత్వం
శివ శివానీలు విశ్వవ్యాప్తం
నిరాకార లింగ స్వరూపం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి