మాట యొక్క పరమార్థం ఏమిటి ఎదుటి వారు చెప్పినది విని దానికి తగిన సమాధానం చెప్పడం వాడు చెప్పిన మాటలు విన్నప్పుడు దాని పూర్తి అర్థం మనసుకు పట్టాలి వ్యతిరేకార్థము ఉన్నదా? లేదా? అన్నది అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సరైన సమాధానం చెప్పాలి ఆ చెప్పేటప్పుడు కూడా అవతల వ్యక్తి యొక్క వయస్సును బట్టి ఉంటుంది తండ్రితో తల్లితో మాట్లాడవలసి వస్తుంది అప్పుడు మాట్లాడే పద్ధతి వేరు ఎలాంటి పొరపొచ్చాలు ఉండడానికి వీల్లేదు మరి స్నేహితులతో మాట్లాడేటప్పుడు హాస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకూలమైనవి ఆననుకూలమైనవి కూడా వస్తూ ఉంటాయి. అంతమాత్రం చేత వారిలో వారికి విరోధాలు జరగవు. కనుక సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాటలు మాట్లాడాలి. మనం నడిచి వెళుతున్నప్పుడు రోడ్లమీద రాళ్లూరప్పరు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రాళ్లు కాలితో ప్రక్కకు జరిపే విధంగా ఉంటాయి కొన్ని పాతుకొని ఉంటాయి దీనిని కొంచెం కష్టపడి గునపంతో పొడిచి దాన్ని బయటకు లాగుతాం బాటసారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే ఒక పెద్ద బండ రాయి ప్రక్కన ఉంటే అది ఒక శిల్పి (స్తపతి) చూసినప్పుడు ఆ రాయి ఎలాంటిది శిల్పానికి పనికి వస్తుందా లేదా అన్న విషయాన్ని గమనించి దాని లోపల ఉన్న ఆకారాన్ని బయటకి తీయడానికి ఆ పైపై అడ్డంకులన్నిటిని తీసి పక్కన పెడతాడు. అలా ఏ రాయినైనా తీర్చిదిద్దే స్థితి ఒక మనిషికి మాత్రమే ఉంది రాయి రప్పలోనే కాదు ఏ విషయంలోనైనా తప్పు జరిగితే ఆ తప్పును సరి చేసుకునే పద్ధతి ఉంటుంది.
ఒక వ్యక్తి మాట్లాడే మాటలవల్ల మంచి జరగవచ్చు ఇంకొకసారి చెడు జరగడానికి అవకాశం ఉంది అతను మామూలు ధోరణిలో మాట్లాడిన మాట కూడా ఒక్కోసారి పట్టింపుగా ఉంటుంది కావాలనే నా మనసును క్షోభ పెట్టాలన్న అభిప్రాయంతోనే నీవు ఇలా మాట్లాడావు అని అవతల వాడు అపార్థం చేసుకున్నప్పుడు తగాదాలకు మూలమవుతుంది ఆ తగాదా జీవితాంతం మనస్పర్ధలు అలా కొనసాగుతూనే ఉంటాయి కనుక వేమన మనకు మనం మాట్లాడే ప్రతి మాటను తూచి తూచి మాట్లాడాలి ఎదుటివారి స్థితిగతులను కూడా గమనించి మాట్లాడాలి లేకపోయినట్లయితే ఇలాంటి అపార్థాలకు అవకాశం ఉంటుంది జీవితంలో దానిని సరిదిద్దుకోలేవు అని తన ఆట వెలది ద్వారా సామాన్య ప్రజలకు కూడా తెలిసే పద్ధతిలో చెప్పాడు ఆ పద్యాన్ని చదవండి.
"మాటదిద్దవచ్చు మరి యగ్గు లేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు దిద్దరాదు మహినెంత వాడికి..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి