న్యాయములు-36
కాక త్రోటి బింబ న్యాయము
*****
కాకము అంటే కాకి.త్రోటి లేదా త్రోటిః అంటే ముక్కు. కాకి త్రోటి అనగా కాకి ముక్కు.బింబః అనగా దొండపండు.
కాకేమో నల్లగా ఉంటుంది.దొండపండేమో చూడచక్కని ఎరుపురంగులో నిగనిగలాడుతూ వుంటుంది. ఈ రెంటినీ కలిపి చూసినప్పుడు నచ్చని వ్యతిరేక భావన మనసుకూ కళ్ళకూ కలుగుతుంది.కంటికి అస్సలు ఇంపుగా అనిపించదు.
రెండూ వేర్వేరుగా స్పష్టమైన తేడాతో, ఒకే దగ్గర సామ్యం లేకుండా కనిపిస్తూ ఉండడాన్నే ఈ కాకత్రోటి బింబ న్యాయము అంటారు.
దీనిని ఎక్కువగా వివాహ విషయంలో ఉపయోగించడం చూస్తుంటాం.
రంగు, రూపం అందంగా ఉన్న అమ్మాయినో లేదా అబ్బాయినో అనాకారిగా రంగు రూపం తేడాతో ఉన్న అబ్బాయికో లేదా అమ్మాయికో కట్టబెట్టినపుడు అంటే పెళ్ళి చేసినప్పుడు అక్కడికి వచ్చిన బంధుజనం ఈ న్యాయమును ఉదాహరణగా అనుకుంటూ ఉంటారు.
దీనినే తెలుగులో సామెతగ "కాకి ముక్కుకు దొండపండు" అంటాం.
ఇలా ఒకదానితో ఒకటి ఎలాంటి సారూప్యత లేని వస్తువులను ఒకే గాటకు కట్టి చూసినప్పుడల్లా "కాకి ముక్కుకు దొండ పండు" సామెత, ఈ "కాకత్రోటి బింబ న్యాయము" గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు విరియకుండా వుంటుందా!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి