ఆధునిక తెలుగు కవులు.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 సంగీతం ఆలపిస్తున్నట్లు విన వచ్చేది, స్పష్టమైన ఉచ్చారణ కలది, రసభావాల ఆవిష్కరణకు తగింది, జీవులలోని చేపను చమత్కరించేది, చందస్సులోని అందాన్ని చూపేది-తెలుగు అన్నారు-రామాయణ కల్పవృక్ష మహాకవి విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు పద్యాలు ముక్కోటి ఆంధ్రుల నాలుకలనే దేవాలయాలలో ప్రార్థన అవి ప్రాణవంతమైన స్వర మాధుర్యాలతో దర్శనం ఇస్తాయి అన్నారు-భావకవి రాయప్రోలు సుబ్బారావు. తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మన కంటి వెలుగు అన్నాడు-సినీ కవి ఆరుద్ర.
తరిపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాది ఆమని పూల వలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష.
అన్నాడు-ప్రగతి గీత ప్రవక్త డా"నండూరి రామకృష్ణమాచార్య.
తెలుగు భాష మాధుర్య ఘట్టాలను కొందరు సాహితీవేత్తలు ప్రత్యక్షంగా చాటి చెప్పారు. మరికొందరు కవి పండితులు పరోక్షంగా ప్రస్తావన చేశారు. అనంతంగా ప్రవర్ధమానమైన తెలుగు భాష జగత్తులో మాధుర్యాలలో.

కామెంట్‌లు