వినుమువినుము అమ్మానాన్నల మాటలు
పాటించుము తప్పక ఆరోగ్యసూత్రములు
ఉండుము కలసిమెలసి అన్నాతమ్ముళ్ళు
చూపుము అక్కాచెల్లెళ్ళుపై ప్రేమానురాగాలు
వెళ్ళుమువెళ్ళుము పాఠశాలకు ప్రతిదినమును
నేర్వుమునేర్వుము పంతులుచెప్పిన పాఠాలను
చేయుముచేయుము ప్రక్కపిల్లలతో స్నేహాలను
ఉంచుముయుంచుము శుచిగా పరిసరములను
చేయుముచేయుము వేళకు భోజనాలను
దిగకుదిగకు వాగులు వంకలయందెపుడు
చెయ్యుముచెయ్యుము రోజూ వ్యాయామాలు
రాకుమురాకుము బయటకు వానావరదలపుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి