మనభూమి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
భూగోళం మనతల్లిరా
భూబిడ్డలం మనమురా

భూగోళం సుందరమురా
భూమి మనకాధారమురా

భూగోళం గుండ్రమురా
భూభ్రమణాలు రెండురా

తనచుట్టు రోజూతిరుగురా
పగలురాత్రులు ఏర్పడురా

సూర్యునిచుట్టు ఏడాదితిరుగురా
వాతావరణమార్పులు జరుగురా

చంద్రుడు భూమికి ఉపగ్రహమురా
భూమిచుట్టు నెలకొకసారి తిరుగురా


కామెంట్‌లు