మార్గం! అచ్యుతుని రాజ్యశ్రీ

 వర్మ ఓచిన్న సామంత రాజు.వయసు మీద పడటంతో బాధ్యతలు కొడుకు కి అప్పగించాడు.తాను ఆధ్యాత్మిక మార్గం లోకి వెళ్లాలనుకున్నాడు.ఓసాధువు గుహలో ఉన్నాడని తెలుసుకుని తన మహల్ కి తీసుకుని రమ్మని కొడుకు ని పంపాడు. అతను గుహలో కి వెళ్లి "స్వామీ!మాతండ్రిగారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు. రథం తెచ్చాను" అన్నాడు. సాధువు "నాయనా!మీనాన్న నే నాదగ్గరకి తీసుకుని రా!" అని పంపాడు. వర్మ తో కొడుకు అన్నాడు "నాన్నా!నీవు చెప్పినట్లే నేను నడుచుకుంటున్నాను.మరి గురువు ని వెతుక్కుంటూ నీవే వెళ్లాలి" అని తండ్రిని  గుహబైట దింపాడు.రాజు ఆచిన్న గుహలో బాగా వంగి నడుస్తూ ఎక్కడో మినుకుమినుకు అంటున్న దీపం వైపు అడుగులేసి సాధువు పాదాల వద్ద కింద కూచున్నాడు. " రాజా! నీకొడుకు చిన్నవాడైనా యోగ్యుడు.నీవు మాత్రం రాజుని అనే అహంకారం తో  వచ్చావు.గుహలోకి వంగి నడిచి వచ్చినాకాళ్ల వద్ద కూలబడ్డావు.ఇప్పుడు నాశిష్యునిగా మారే అర్హత నీకు వచ్చింది " అనటంతో రాజు సిగ్గు పడ్డాడు🌺
కామెంట్‌లు