కార్వేటినగరం కథలు పుస్తక ఆవిష్కరణ
 పిల్లలు ఎప్పటికీ మరిచిపోనివి నాన్నమ్మ చెప్పిన కథలేనని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర అన్నారు. స్త్రీలు పిల్లలకి కథలు చెప్పడం ద్వారా మన సంస్కృతి, నాగరికత, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసిన వారవుతారని ఆయన తెలిపారు. బాల సాహిత్యాన్ని ,విద్యార్థులు ఎంత విస్తృతంగా చదివితే వారి ఆలోచనాపరిధి పెరిగి నూతన ఆవిష్కరణలు చేయగలుగుతారని చెప్పారు.
  కార్వేటి నగరంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు గారు రచించిన  "కార్వేటినగరం కథలు" బాలల కథల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 
  సభాధ్యక్షులు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాం పురుషోత్తం  మాట్లాడుతూ  అందరికీ మంచిని నేర్పే చక్కటి కథారచన ద్వారా శ్రీ ఆర్ సి.కృష్ణ స్వామి రాజుగారు చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. వారి రచనను డైట్ కళాశాలలో ఆవిష్కరించడం వలన ఛాత్రోపాధ్యాయులకు గొప్ప ప్రేరణ కలుగుతుందని తెలియజేశారు. 
  పుస్తక సమీక్ష నిర్వహించిన ప్రముఖ బాలల కథా రచయిత హరికిషన్ గారు ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 10 కథలు నేర్చుకోగలిగితే విద్యార్థుల హృదయాలను గెలుచుకోగలుగుతాడని, పేర్కొన్నారు.
  రచయిత ఆకాశవాణి విశ్రాంత ప్రోగ్రాం హెడ్ ఆకుల మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైనదని, ఉపాధ్యాయులు తమ వ్యక్తిత్వం ద్వారా భావిభారత పౌరులను తీర్చిదిద్దగలరని, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తమ జ్ఞానాభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్   ప్రిన్సిపాల్ చెంగల్ రాజు, లెక్చరర్ లు ప్రభాకర్, నాగరాజు నాయక్, సాహితీ ప్రియులు భాస్కర్ రాజు, గాజుల నాగేశ్వర రావు,బాల సాహితీ వేత్త ఓట్ర ప్రకాష్ రావులు పాల్గొన్నారు.
ఆర్.సి.కృష్ణ స్వామి రాజు 
9393662821


కామెంట్‌లు