ఇష్టమైన జీవితాన్ని నష్టపరుచు కోకు
కష్టమైన ఆలోచన ఉన్నత బాట సాగనీ
అవరోధాల విషవలయాలలో చిక్కకు
నమ్మిన నిజాన్ని వదలనే వదులకు!!!
పదిమందీ నిను మెచ్చగ పొంగిపోకు
అందరూ నిను అనుసరించ నడు
బంగారు బాటలో నడక నేర్పు
. మలచుకో మహనీయ రీతిలో!!!
నమ్మిన నీతి సడల నీకు సరివారిలో
ఉన్నత భావాల ప్రస్థానం కంటకప్రాయం
కరడుగట్టిన భాషణ కఠినాత్మకం
కరగదు కన్నీటికి వ్వర్థం చేయకు కాలాన్ని
అపురూపమైన అందాల ధ్రువతార గ యావత్త్ప్రపంచం నిను పొగడ రామశరముగ నిలచిపో చిరస్థాయిగా అందరి మన్ననలు నడుమ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి