భాష అంటే మాట్లాడేది. భాష ణ సామర్థ్యం మానవులకు మాత్రమే ఉంది. దేవుడు మనుషులకు ప్రసాదించిన గొప్ప వరం భాష. అందుకే తెలుగువారి జీవన మాధుర్యం తెలుగు భాషలో కనిపిస్తుంది.
ప్రతి జాతికి భాష జీవనాడి. ఎందరో కవులు రచయితలు తీర్చిదిద్దినారు. కొత్త కొత్త సొగసులు కూర్చడానికి నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. వీరిలో ఏ కొందరి తీరుతెన్నులైనా మనం పరిశీలించాలి. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. అప్పుడే ఆయా భాషల సంస్కృతి వైభవాలు తెలుస్తాయి.
భాష మీద అధికారం కలవాడు తన భావాలను ఎదుటివారికి చక్కగా చెప్పగలుగుతాడు. మధురమైన మాటల వల్ల కలిగే లాభాలను ఈ క్రింది పద్యం స్పష్టం చేస్తూ ఉంది:
మాటల చేత దేవతలు మన్నన చేసి ఒలంబులిత్తురా
మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులిత్తురా.
మాటలచేత మానినులు మన్నన చేసి మనం లిత్తు రా
మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదే యేరికిన్.
పోతన మహాకవి మోక్షాన్ని పొందింది మాటలచేతనే! శ్రీ నాథుడు సత్కారాలు పొందింది మాటల చేతనే!
వ్యక్తుల మధ్య గాఢమైన ప్రేమ పుట్టేది మాటల వల్లనే. కాబట్టి సంభాష ణ చాతుర్యం పెంపొందించుకోవాలి.
భాషా నిర్వచనం.; - తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి