సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి, అందులో పనికిరాని మొక్కల్నితొలగించి, దున్ని నీరుబట్టి, ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. ఆ పంతలు తిన్నవారికి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. మంచి ఆరోహ్యం తో ఇతర ఐశ్వర్యాలు వాతంతట అవే లభిస్తాయి.
మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాన్ని అదుపులో వుంచి చెడును తొలగించి మంచిని పెంచితే సకల ఆరోగ్యాలు పంచి ఇస్తుంది . శరీరాన్ని సత్వపధాన పయనింప చేయుటకు వుంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలుస్తాయి.
మన అలవాట్ల మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమ శిక్షణ, సచ్చీలత, సత్సంప్రదాయాల్ని నేర్చుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే యిప్పడు రకరకాల ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి యువకులు, పెద్దవాళ్లేగాక బాలబాలికలు సైతం చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఇందువలన మానసికంగా, శారీరకంగా ఎంతో అనారోగ్యం పట్టిపీడిస్తుంది. మానవ జీవితంలో సగ భాగం ఈ అనారోగ్యాలతో యుద్ధం చేయడం లోనే సరిపోతుంది.
దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మలవిసర్జన, మూత్రవిసర్జన, స్నానం, నిద్రలను గురించిన వివరాలు తెలుసుకొని, వాటిని సక్రమంగా అమలుబరిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.
ప్రస్తుతం అనుభవిస్తున్న రోగాలు, బాధలు, కష్టాలన్నీ ఇలా మనం స్వయముగా సంపాదించుకున్నవే. కాకపోతే మనం ఈ కారణంగా వచ్చాయని తెలుసుకోలేకపోతున్నాము. ఈ రోగాలను, కష్టాలను పోగొట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నాము. ఒక ప్రక్క శరీరాన్ని స్వయముగా చెడగొట్టుకుంటూ మరో ప్రక్క బాగుచేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎప్పటికైనా పూర్తిగా ఫలిస్తాయా? ఇలా ఆరోగ్యాన్ని పొందడం అసాధ్యం. ఈ రహస్యాన్ని గ్రహించి అమెరికాలాంటి దేశస్తులు ఈ మధ్య చెడ్డ అలవాట్లకు దూరం అవుతూ మంచి అలవాట్లను నేర్చుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. మన శరీరానికి మనం మంచి సాంగత్యాన్ని అందించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి