పిల్లలు ఎదిగే కొద్ది వల్ల ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. వయస్సు రీత్యా పిల్లలకు ఏది మంచో, చెడో అన్న విషయంపై అంతగా అవగాహన అనేది ఉండదు.అందుకని పిల్లలకు చిన్న వయసులోనే మంచి చెడులపై అవగాహన కలిగించాలి. ఆ బాధ్యతను ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు తప్పనిసరిగా తీసుకోవాలి. తమకు సమయం లేదని తల్లిదండ్రులు, ఇది మా బాధ్యత కాదని ఉపాధ్యాయులు తప్పుకుంటే, ఆ ప్రభావం చిన్నారులపై తీవ్రంగా పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని మానసిక శాస్త్రవేత్తల సూచన. ఎందుకంటే పిల్లలు చేసే ప్రతీ పనీ వారి తల్లిదండ్రులను చూసి అనుకరిస్తుంటారు. కనుక తల్లిదండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలు నేర్చుకొంటారు. కాని తాము ఆచరించకుండా, నీతి నియమాలు, ప్రవర్తనావళి గురించి తల్లిదండ్రులు పిల్లలకు బోధిస్తే అది వ్యర్థం. కేవలం తమ నడవడిక ద్వారా మాత్రమే తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలను చెప్పగలరు. సమయం వచ్చినప్పుడల్లా పిల్లలకు పురాణ కథలు, నీతి కథలను చెప్తూ ఉండాలి. ఇలా చేయడం వలన పిల్లలకు భాషాభివృధ్ధి, నైతిక విలువలు, భద్రతా భావం,మంచి నడవడిక, క్రమశిక్షణ , బాధ్యత ప్రవర్తన కలిగించవచ్చు.
సాధ్యమైనంత వరకూ అందరూ కలసి భోజనం చేసేలా చూడాలి. టీ.వీ. చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు, దీనికి బదులు ఆరోజు జరిగిన విశేషాలను కుటుంబంలో అందరూ కలిసి పంచుకొంటూ భోజన సమయాన్ని గడపవచ్చు. పిల్లలను వారి స్కూల్లో ఆరోజు జరిగిన విశేషాలను మాట్లాడమని ప్రోత్సహించాలి.. అలాగే క్రింద పడకుండా శుభ్రంగా భోజనం చేయడం, భోజనం ముందు, తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలి.
పిల్లల వ్యక్తిగత అభిరుచులూ, ఆసక్తిని కూడా తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించాలి. పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజారులో దొరికే కొత్తరకాల రంగులూ, బొమ్మల పుస్తకాల వంటివి కొని వారిని ప్రోత్సహించవచ్చు. బొమ్మల పోటీలు నిర్వహించే ప్రదేశాలకు వారిని తీసుకెళ్ళి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఇప్పుడు చాలా సంస్థలు ఆన్ లైన్ విధానం ద్వారా పోటీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇందులో పాల్గొనడం వలన ఎలాంటి సమయం వృధా కాదు.అలాగే మన అభిరుచులను వారిపైకి రుద్దకుండా స్వతహాగా వారిలో ఉండే ఆసక్తులను గమనించి ప్రోత్సహించాలి. దీనివలన పిల్లలలో సృజనాత్మకత మెరుగవుతుంది. రకరకాల పోటీలలో పాల్గొని ముందుండే పిల్లలు చదువులో కూడా ముందుంటారు అన్నది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి