స్మశానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శవాన్ని దహనం చేసే సమాధి చేసే స్మశానం అంటే అందరికీ భయం బెరుకు ఒణుకు! అక్కడ భూతప్రేత పిశాచాలుంటాయని  పుకార్లు షికార్లు కొడతాయి.ఒక్క కాటికాపరిమాత్రమే తన కుటుంబంతో ఉంటాడు.ఇప్పటిదాకా మనతో ఉన్న వ్యక్తి కాటికిచేరేదాకా కడివెడు కన్నీరు కార్చి  ప్రేతంగా మారాడనే ఆలోచన తో భయపడటం తప్పు. 
కాటికాపరిగా ఉన్న ఆఅవ్వ అమ్మా నాన్నలని కోల్పోయిన మనవరాలిని పెంచి పెద్ద చేసి స్మశానంలోనే ఆపిల్లకి పెళ్ళి చేసింది అనేవార్త వైరల్ ఐంది. శివుడు స్మశానం లోనే ఉంటాడు. విభూదిని మనం నుదుట పెట్టుకుంటాం.కానీ నిజానికి గూండాగిరి చేస్తూ ఇతరులకు హాని అపకారం తలపెట్టేవారే పిశాచాలు దెయ్యాలు.కాకపోతే శవదహనం వల్ల వాతావరణం కలుషితం కావచ్చు. ఆవాసన భరించలేకపోవచ్చు.అందుకే పూర్వం ఊరికి చాలా దూరంగా అవి ఉండేవి.ఇప్పుడు ఆప్రాంతంని కబ్జా చేసి ఇళ్ళు కట్టుకుని ఉంటున్నాం.అనవసరంగా ఏవేవో ఊహాగానాలు చేసి భయపడరాదు"టీచర్ చెప్పిన  మాటలు విన్న పిల్లలలో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అనవసరంగా బాల్యంనించి కట్టుకథలు చెప్పి పిరికిమందు నూరిపోయరాదు🌹
కామెంట్‌లు