ఈ వయస్సులోనూ వైద్యసేవలు;- - యామిజాల జగదీశ్
 ఆయన వయస్సు 81 ఏళ్ళు. అయితేనేం...ఇప్పటికీ ఆయన వైద్యం చేస్తూనే ఉన్నారు. ఆయన పేరు అరుళానందం.
శ్రీలంకలోని యాయ్ పాణం సావకచేరీలో డాక్టర్ అరుళానందం అంటే తెలియనివారుండరు. ఆయన తన వైద్యసేవతో ప్రజల హృదయంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఎనభై ఒకటో ఏట కూడా రోజూ ఉదయం ఏడు గంటలకల్లా పని మొదలు మొదలుపెడతారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ తన క్లినిక్కులో ఉంటారు. తన దగ్గరకొచ్చే పేషంట్లకు ఎంతో ఓర్పుతో వైద్యం చేస్తారు. ఆయన తీసుకునే ఫీజు చాలా తక్కువ. పైగా పేదవారికీ దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచితంగా సేవలందిస్తారు. 
ఆయన గురించి ఓ పత్రిక "ఈయన ఓ మానవదేవుడు. ఆయన దగ్గర చికిత్స పొందిన వారిలో నేనూ ఒకడిని. ఆయన మాట తీరుతోనే సగం జబ్బు తగ్గిపోతుంది. మిగతా సగం ఆయన నాడీ పట్టుకుని ఇచ్చే మందులతో నయమవుతుంది. ఎంతటి అనారోగ్యంతో వెళ్ళినా టానిక్కులాంటి మాటలతో నీరసాన్ని పోగొడతారు. ఫీజు చాల తక్కువ..." అని రాసింది.
ఆయన చేసే వైద్యంతో సేవ చేయాలనుకునే మనసుకి వయస్సొక అడ్డంకి కాదనే అభిప్రాయం కలుగుతుంది.

కామెంట్‌లు