"తాతా!ఇవాళ మాస్నేహితులు వస్తారు మన ఇంటికి. ముందు నాదగ్గరకే తెచ్చి పరిచయం చేస్తాను " పొగాకు చుట్టతాగుతున్న తాత శివంమాటలకు ఆశ్చర్య పోయాడు. రోజూ ఓఐదునిముషాలు కూడా తనతో మాట్లాడని మనవడు ఇలా చెప్పటం వింత గా అన్పించింది. చుట్టలు కాల్చటం శివా కి నచ్చదు.అతని అమ్మా నాన్న లు చెప్పి చెప్పి విసిగిపోయారు."పోరా!నాచిన్నప్పటినుంచి ఉన్న అలవాటు " అని దగ్గుతున్నా పొగాకు మానడు.అందుకే తన ఇంజనీరింగ్ కాలేజీ ప్రెండ్స్ తో చెప్పించాలనే చిన్న ప్రయత్నం శివా ది! ఆరోజు ముందుగా తన ఇద్దరు స్నేహితులకు తాత నిపరిచయం చేయాలి అని ఆయన గదిలోకి దారితీశాడు."మాతాత గదిలోదేవుడి పుస్తకాలు టి.వి.చాలా నీట్ గా ఉంచుతారు మాతాత" ఆమాటలు విన్పడగానే తాత చుట్టలు కనపడకుండా అల్మారాలో దాచేసి పుస్తకం పట్టుకున్నాడు. ఆవచ్చినకుర్రాళ్లు "తాత గారూ!శివా రోజూ మీగురించే చెప్తాడండి.మీరు రోజూ దగ్గర కూచోబెట్టుకుని చదివిస్తారుట! అందుకే మార్కులు బాగా వస్తాయని డిసిప్లిన్ కి మారుపేరు మాతాత అని చెప్తాడు" ఆమాటలతో తాత లో గొప్ప మార్పు వచ్చింది. శివా కి తను చుట్టలు తాగటం ఇష్టం లేదు. అంతే పొగాకు బంద్!శివా కి చాలా ఆనందం గా ఉంది ఇప్పుడు 🌸
మార్పు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి