సిరిమువ్వల సవ్వడి
సెలయేటి అలలలో
ప్రవహించే నీటిలో
ఎన్ని అందమైన లయలో
గుప్పెడు గుండె నిండా
పట్టలేని సంతోషపు తలపులు
జ్ఞాపకాల శిలలకు జోల పాడుతూ
వయ్యారంగా సాగిపోవు కెరటాలు
కళ్ళలోమెరిసేటి మెరుపులో
దాగిన ఆనంద బాష్పాలు
ప్రవాహపు జోరులో
చిందేటి చినుకులు
హృదయాంతరంగంలో
ఉప్పెనగా పోంగే భావాలు
కొండ దారుల మెలికలు తిరిగే
జలపాతపు మెలికలు
జలజలా పరుగులిడుతూ వచ్చే
జవరాలికై కడలి నిరీక్షలు
కను విందుగ వీక్షించి
మది పొందిన అపేక్షలు
అంతులేని సంతసమిచ్చు
ప్రకృతి అనంతమైన అందాలకు
మైమరచిపోనట్టి మనసేలా
చేయడ్డుపెట్టి రక్షించని మనిషేలా?
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి