బిచ్చానికీ
భిక్షకూ ఉన్న తేడా....
అనంతం !!
దీనిని
స్పష్టంగా అర్థం చేసుకోవాలి
బిచ్చం....అనేది
ఏది ఇచ్చినా పుచ్చుకోవడం
కానీ భిక్షగా బియ్యం మాత్రమే
ఇవ్వాలి
విధిరాతతో
ఆస్తిపాస్తులు కోల్పోయి
బతకడానికి మరో దారి లేక
అడుక్కోవడం " బిచ్చం "
సుఖభోగాలతో
బతికే అవకాశమున్నా
వాటన్నింటినీ వదులుకుని
సాధువల్లే ఉంటూ అడగటం
భిక్ష
బిచ్చం వేయడం
కరుణతో కూడినది
కానీ
భిక్ష బాధ్యతతో కూడినది
అడుక్కునే వ్యక్తికి
ఇవ్వకుండా పోతే
పుణ్యం మాత్రమే దరి చేరదు
పాపమేమీ లేదు
కానీ
భిక్ష వేయడం మానితే
పాపమూ వెంటే వస్తుంది
ఎందుకంటే
భిక్ష పొందేవారు
మన దగ్గర
బియ్యాన్ని మాత్రమే
తీసుకోవడంలేదు
దానితోపాటు
మన పాపాన్నీ
తీసుకుపోతారన్నది
పెద్దల మాట
ఇలా
బిచ్చానికీ
భిక్షకు ఉన్న తేడా
తెలుసుకోవాలి
"బిచ్చం వేయండి!
భిక్ష ఇవ్వండి!!"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి