ఐదోక్లాస్ చదువుతున్న శివా ఆబడికి చెందిన హాస్టల్లో చేరాడు.దానికి కారణం అమ్మా నాన్న బాగా గొడవ పడి విడాకులు తీసుకున్నారు. వాళ్లిద్దరూ రోజూ ఫైటింగ్ తో శివా బేజారుతో బెంబే లెత్తాడు.వారిద్దరు అంటే కోపం కసి విసుగు ఏర్పడ్డాయి.తను బడికి నాన్న ఆఫీసు కి వెళ్లగానే బైట కి వెళ్తోంది అని నాన్న అరుపులతో తెల్సింది.అమ్మ నాన్న తో"నీవు సిగరెట్ తాగుడుతో ఎప్పుడో ఇంటికి తూలుతూ వస్తే ఎట్లా?" అని రంకెలేస్తుంది.నాన్న రెచ్చిపోయి "ఇంటికి తాళం వేసి ఎవడితో ఊరేగుతున్నావు?" అని ఆరాతీయటంతో అగ్ని లో ఆజ్యం పోసినట్లు ఐంది. మాటలయుద్ధం మొదలైంది. శివా కూడా తను ఇంటికి వచ్చేసరికి అమ్మ కొత్త అంకుల్ తో నవ్వుతూ మాట్లాడటం చాయ్ టిఫిన్ పెట్టడం చూశాడు. "అమ్మా!ఎవరా అంకుల్?" అని అడిగితే చెంప ఛెళ్లు మనిపించింది. "మీనాన్న కన్నా వెయ్యిరెట్లు నయం! నీకు ఫీజు కడుతున్నాడు .నాకు కావల్సిన కాస్మెటిక్స్ కొంటున్నాడు." అంతే శివా నిహాస్టల్లో పడేసింది.ఏమూడు నాల్గునెలలకోసారో చూసి పోతుంది. తండ్రి కూడా అంతే!
అందుకే శివా కి హాస్టల్ హాయిగా ఉంది. కానీ అప్పుడప్పుడు ఆపసిమనసు అమ్మా నాన్నల కోసం ఏడుస్తుంది.ఓరోజు 8వక్లాస్ చదువుతున్న హరి పలకరించాడు."శివా! బాధపడకు.మా అమ్మ నాన్న కోవిడ్ తో చనిపోయారు. మామ ఇక్కడ చేర్పించాడు. ఇక్కడ ప్రశాంతంగా చదువుకుని గొప్ప వారు ఐనవారు ఎంతో మంది! ఇక్కడ ఉన్న టీచర్లు సార్లు మన లోకో పేరెంట్స్!"అని బుజ్జగిస్తూ నచ్చచెప్పాడు. అంతే శివా దిగులు బాధ మర్చిపోయి ఆటపాటల్లో చదువులో ఫస్ట్ వస్తున్నాడు🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి