కందం:
*చమురింకిపోయినను దీ*
*పము శమియించిన విధంబు పౌరుషము విహీ*
*నమె యగును; దైవ మనుకూ*
*లము గాకుండినను భూతలమున కుమారా !*
తా:
కుమారా! ప్రమిదలో ఉన్న నూనె అయి పోయినప్పుడు, దీపము కొండెక్కి పోతుంది. అలాగే, దైవము అనుకూలించనప్పుడు, ఎంత పౌరుషము ఉండి, యుద్ధ నేర్పరి అయినా శక్తి లేనివాడే అవుతాడు .............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*రామాయణంలో వాలి ఎంతటి శక్తి వంతుడో సుగ్రీవుడు కూడా అంతటి వాడే. కానీ దైవం తోడు రానంత వరకు, సుగ్రీవుడు ఓడిపోతూనే ఉన్నాడు. అలాగే, అతిరధుడైన కర్ణుడు. అర్జునునితో సమానమైనా అవ్వాలని, అవకాశం ఉంటే, అర్జునుని మించి ఎదగాలని కోరుకుని, ఎంతో శ్రమకు ఓర్చి, ఆ యుగంలోనే కుల వివక్ష ఎదుర్కుని, గురువు శిక్షణ ఇచ్చేదాకా ఒప్పించి, సాధించుకున్న అస్త్ర విద్యలు అన్నీ కర్ణునికి అవసరమైన సమయంలో, దైవం అతనికి అనుకూలించని కారణంగా, అతను నేర్చుకున్న, సాధించిన అస్త్ర, శస్త్ర విద్యలు అన్నీ పనికిరాకుండా పోయాయి. మానవుడుగా తాను ఏమి సాధించాలి అన్నా కూడా భగవంతుని చేదోడువాదోడు ఎల్లప్పుడూ అవసరమే. ఇది తెలుసుకుని, అహర్నిశలూ ఆ జగద్రక్షకుని పధ్మపాదాలు విడువకుండా పట్టుకుని ఉండే వాడే ధన్యడు. అటువంటి, పరమాత్ముని తోడు మనకు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించమని ....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి