కందం:
*ఎటువంటి వర కులంబున*
*బటు తతముగ బుట్టెనేని పరగగ మును గ*
*న్నటువంటి కర్మఫలముల*
*కటకట భోగింపవలయు గాదె కుమారా !*
తా:
కుమారా! ఎంత గొప్ప వంశములో పుట్టిన ఎంత గొప్ప వ్యక్తి అయినా, పూర్వజన్మలో తాను చేసిన పనుల ఫలితాలు ఈ జన్మలో అనుభవింప వలసిందే. చేసిన పనియొక్క ఫలితం అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు అనే విషయాన్న అందరూ గుర్తుంచుకోవాలి.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మనకు బాగా తెలిసిన పురాణ పాత్రలు. పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరు తాము చేసిన పనికి ఫలితంగా ఏడు జన్మల పాటు పరమాత్మ విరోధులుగా పుట్టి, ప్రతీ జన్మ లోనూ పరమేశ్వరుని ద్వేషించి చివరికి పరమాత్మ లో ఐక్యము చెంది, దేవలోకానికి తిరిగి వెళ్ళారు. మరి, అంతటి వారికే తప్పక పోతే, మనుషులం మనమెంత. మన సామర్థ్యం ఎంత. అందువల్ల, అవకాశం ఉన్నంత వరకు, ఒక వేళ అవకాశం లేకపోతే అవకాశం కల్పించుకుని, ఎదుటి వారి మంచి గురించి ఆలోచిస్తూ, మంచి దారిలో నడిచే ప్రయత్నం చేస్తూ, చివరికి ఇంకొక జన్మ లేని, కైలాసాన్ని చేరుకునే దారిలో మనల్ని నడిపించమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి