కందం:
*పెక్కు జనులు నిద్రింపగ*
*నొక్కెండయ్యెడను నిద్ర నొందక యున్నన్*
*గ్రక్కున నుపద్రవంబగు*
*నక్కర్మమునందు జొరకుమయ్య కుమారా !*
తా:
కుమారా! ఒక చోట ఉన్న వారందరూ, నిద్ర పోతుండగా, ఒక మనిషి నిద్ర పోకుండా మెలకువతో ఉన్నాడు అంటే, ఆ స్థలంలో ఏదోక ఉపద్రము లేదా ఇబ్బంది దాగి ఉంటుంది. అటువంటి చోటులకు వెళ్ళకుండా ఉండడము మంచిది.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*సమాజంలో నలుగురూ వెళుతున్న దారిలో మనం కూడా వెళితే, చేరవలసిన గమ్యానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా చేరుకుంటాము. అలా కాకుండా, వేరే కొత్త దారిలో వెళదాము అనుకుంటే, ఆ కొత్త దారిలో కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక భజన కార్యక్రమంలో, అందరూ పరమాత్ముని భజన చేస్తుంటే, మనం పక్క వారితో కబుర్లు పెడితే, మనం చేసే పని ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే, పోలీసు "ఈ దారి వన్ వే అండి, ఇటు వెళ్ళ గూడదు" అని చెప్పినా కూడా మనం ఆ దారిలోనే వెళితే పృభుత్వానికి ఫైన్ కట్టవలసి వస్తుంది, ఇంకా ఏ దైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక, సమాజంలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే మంచి బుద్ధి ని మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి