కందం:
*మధురంబుల గొననొల్లడు*
*బుధజనుఁడేకతమ దారిబోనొల్లఁడు నీ*
*విధ మెరిగి నీవును మనో*
*రధ సిద్ధుఁడు వగుచు మెలగరాదె కుమారా !*
తా:
కుమారా! పండితుడైన వడు, బుద్ధిమంతుడు తీయని పదార్ధాలను ఒంటరిగా తాను ఒక్కడే తినాలి అనుకోడు. అలాగే, ఇక దారిలో తాను ఒక్కడే మంచి దారిలో వెళ్ళాలి అనుకోడు. అందువల్ల, నువ్వు కూడా, ఈ మంచి విషయాలను అర్థం చేసుకుని, ఆదే పద్ధతిలో నడచకుని నీ కోరికలను తీర్చుకునేటట్టు ప్రయత్నం చేయి............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"మనకు కలిగిన ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే, ఆ ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే, మనకు కష్టం కలిగినప్పుడు, మన అనుకునే వారితో చెప్పుకుంటే, ఆ కష్టం వల్ల కలిగే బాధ తక్కువ అవుతుంది" అని పెద్దల మాట. మన చుట్టూ ఉన్న నలుగురిని ఆనందంగా ఉండేటట్లు చూసుకోవడం లోనే మన ఆనందం ఉంది అని నమ్మి, జీవిస్తే, అప్రయత్నంగానే ఆనందం మన సొంతం అవుతుంది. పరాత్పరుడు మనకు ఇచ్చినంతలో, కొంతైనా ఎదుటి వారికి ఇచ్చి, వారితో పాటు మనం కూడా ఆనందించవచ్చు. ఒంటరిగా, ఒక్కరమూ ఏకాకి లాగా ఎంత సంతోషాన్ని అయినా అనుభవించలేము. ఒక బూందీ లడ్డు అయినా, ఆటలో గెలుపు అయినా, చదువులో వేసే ముందడుగు అయినా, ఉద్యోగం లో వచ్చే పదోన్నతి అయినా, ఏ సంతోషం అయినా, నలుగురితో పంచుకున్నప్పుడే, ఇంకా ఎక్కువ సంతోషపడతాము. కనుక, అందరి ఆనందంలో మన ఆనందం చూచుకునే మంచి మనసు మనకు ఇమ్మని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి