ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (29)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అమ్మాయి కళాశాల విద్య పూర్తయిన తర్వాత ఆమెకు వివాహం చేయాలనుకున్నాం  కుంచినపల్లిలో మంచి సంబంధం ఉందని తెలిసిన వారి ద్వారా  కబురు వస్తే నేను, కోటిరెడ్డి స్నేహితుడు మధు కలిసి వెళ్లి  చూసి  అతని మంచితనం ప్రవర్తన నచ్చి సరే అనుకున్నాను  కోటిరెడ్డి కూడా చూస్తే బాగుంటుందని మధుసూదన్ రెడ్డి అంటే  కుర్రవాడు కొంచెం  రంగు తక్కువ కనుక ఆయన చూస్తే ఒప్పుకోరేమో తాను అంగీకరించకపోతే ఇలాంటి కుర్రవాడు దొరకడం కష్టం మీరే నిర్ణయం తీసుకోండి అంటే నేను సరే అన్నాను అలా శైలు పెళ్లి తిరుమలరెడ్డి గారితో వివాహము నిశ్చయమైపోయింది. మా అమ్మాయిని చూడడానికి తిరుమల తాత వచ్చారు తీరా చూస్తే ఆయన మా మేనమామ కొడుకు. నా భార్య అరుణకు స్వయానా అన్న నాకు బావ  మా బావ మాట్లాడకుండా వివాహం చక్కగా అందరి మెప్పులు పొందేలా సుఖంగా చేశాడు. కాలం గడుస్తోంది  మా మనవడికి ఆడపిల్ల మగ పిల్లవాడు  శైలు కూడా ఆడపిల్ల మగ పిల్లవాడికి తల్లి అయ్యింది.  శైలు కుంచన పల్లిలో జీవితాన్ని ప్రారంభించింది.  మా దంపతులం ఇద్దరం అక్కడకు ఇక్కడకు వెళ్లి వస్తూ ఉంటాం  వెళ్ళినప్పుడు ఒక నెల రెండు నెలలు ఉంటాం. అప్పుడు అర్థమైంది నాకు నేను చేసిన తప్పు  పిల్లల అల్లరిని ఆనందించలేనివాడు తండ్రి కానీ, తాతగాని కాలేడు  పిల్లల  ముద్దు ముద్దు మాటలు అనుభవించలేని వారికి ఆప్యాయతకు అర్థం తెలియదు అని నా అభిప్రాయం. పెద్దలతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆ పిల్లలకు తెలియదు  మనసులో  ఏది అనుకుంటారో దానినే బయటకు అనేస్తారు అది తప్పో ఒప్పో తెలియదు  ఆ వయసులో వారిని శిక్షించాలని అనుకుంటారా మురిపంగా ఆనందించాలా  అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అరుణ ఆ పసిపిల్లలతో కలిసి మాట్లాడినప్పుడు ఏమైనా  చిన్న జాగ్రత్తలు చెబితే ఆ చంటిపిల్ల మాకు చెప్పడమే కాదు నీకు కూడా  నువ్వు చెప్పుకోవాలి అన్నప్పుడు ఆనందించాలా? బాధపడాలా?  నేను నీ మొహం చూడను  అన్న పాపను ఎందుకురా అలా అన్నావ్ అంటే మీరు నా దగ్గరకు రావడం లేదుగా  అని గోముగుగా అన్న ఆ పాప ముద్దు మాటలకు మురిసిపోవాలి పులకించుకోవాలి  ఆ చిన్నారుల పాదాలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ మృదు మధుర శరీరాలు నిమురుతున్నప్పుడు  కలిగే అమందానందాన్ని వర్ణించడానికి కరుణశ్రీ గారి కలానికైనా బలం ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఆ అనుభూతి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది  ఆ సుకుమారత్వం కోటిరెడ్డికి పద్మజలకు ఆ అవకాశం లేకుండా చేశానే అని చాలా ఆలస్యంగా గ్రహించాను.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం