ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (30);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కోటిరెడ్డి మనవడు మనవరాళ్లతో  ప్రత్యక్షంగా ఆ సుఖాన్ని అనిపిస్తుంటే తప్ప నాకు నా తప్పు తెలిసి రాలేదు  అందుకు నేను ఎంతో బాధపడుతూ ఉంటాను మనసులో  అది ఎప్పటికీ తీరనిలోటే  కాలాన్ని వెనక్కి తీసుకురావడం మన చేతుల్లో లేదు కదా అది ప్రకృతి చేతిలో ఉంది  సిద్ధాంతం తెలియడం వేరు దానిని ఆచరణలో చూపటం వేరు  దేనికైనా ఆ విద్య వచ్చి తీరాలి  అది లేకుంటే ఎంత చెప్పినా వృధా  అది తెలుసుకున్న వాడే కోటిరెడ్డి  విశ్వవిద్యాలయ విద్యార్థిగా మంచి పేరు సంపాదించుకొని  వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి  కొత్త విధానాలను అవలంబించి  దిగుబడి పెంచడానికి నూతన పద్ధతులను అన్వేషించి దానిని వ్యవసాయదారుల మనసులలో నిలబడేలా చెప్పగలడు అది ఆయనకున్న అనుభవ జ్ఞానం.
కోటిరెడ్డి తన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్న సమయంలో  తన సహధర్మ చారిణి పద్మజను కూడా తీసుకెళుతూ ఉండడం అలవాటు  ఆమెకు కూడా ప్రాథమిక విషయాలను తెలియచేసి ఆమెకు  స్త్రీ కార్మికులకు తెలియజేసే బాధ్యత  అప్పగించాడు. ఆమె కూడా ఎంతో ఉత్సాహంతో నలువురిని పోగుచేసి ఊరికే కబుర్లతో కాలక్షేపం చేసే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో  దానివల్ల కుటుంబానికి ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పి వారిని కూడా విద్యాధికులను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పిల్లల పెంపకంలో కానీ  రోజు చేసే మోటు పనులను నిర్వహించే  వాటిని సులువుగా ఎలా చేయాలో  పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో  అనేక ఉదాహరణలతో  పద్మజ చెప్పడం వల్ల  ఆమె చెప్పింది  విని ఆచరించిన వారికి ఎంతో లబ్ధి చేకూరింది. కోటిరెడ్డి విజయవాడలో లైన్స్ క్లబ్ సభ్యుడిగా చేరినప్పటి నుంచి పద్మజను కూడా  తాను చేసే  సేవా కార్యక్రమాలలో చురుకుగా పాలు పంచుకొనేలా చేసి  వారి కష్ట సుఖాలను తెలుసుకొని వాటిని ఎలా  దూరంగా ఉంచాలో చెప్పి వారిని ఓదార్చి మామూలు పరిస్థితికి వచ్చేలా చేసింది  తనతోపాటు  విషయాలు తెలిసిన  వారిని వేదిక పైకి వచ్చి నిర్మూహమాటంగా వారు ఏది చెప్పదలుచుకున్నారో దానిని  సిగ్గు పడకుండా చెప్పడం కూడా  నేర్పింది  దానివల్ల అనేకమంది స్త్రీలు  మిగిలిన కార్యక్రమాలలో కూడా  పాల్గొని మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు  కోటిరెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా తను కూడా వెంట వెళ్లి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని  తామేం చేస్తే ఆ పరిస్థితులు చక్కబడుతాయో  ఆలోచించి  అలా చేయడం అలవాటయింది.

కామెంట్‌లు