ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (33);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 కలెక్టర్ గారి దగ్గర నుంచి చిన్న రైతు వరకు అందరి సలహాలతో శ్రీ వరి ఆరుతడుల మీద పంట వస్తుంది. కలుపు నివారణకు సూపర్ ఫాస్ఫేట్ ను వాడాలి  అయితే దుక్కిలో సూపర్ వేస్తే తొందరగా కరగదు అంటాడు వరుణ్. ఇలాంటి యువకులు ముందుకు వచ్చి చురుకుగా కష్టపడి పని చేస్తూ  అటు చదువును కొనసాగిస్తూ ఉంటే కన్నవాడు ఎంతో ఆనందిస్తారు. అలా చేస్తూ ఉంటే వేరే ఆలోచనలు లేకుండా తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాజానికి  సేవ చేసినట్లుగా ఉంటుంది ఎక్కువ దిగుబడి వచ్చి దేశానికి వెన్నెముక రైతన్న  అన్న జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు ఆదర్శంగా నిలబడినట్లు అవుతుంది. సినిమాలు టీవీలు చూడాలి అయితే అతి కాకూడదు. అలా చేయడం వల్ల కంటి డబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు చూసిన ఈ కార్యక్రమాలలో  ద్వంద్వ అర్థాలతో కూడినవి కానీ అశ్లీలంగా ఉన్న వాటిని గురించి కానీ  చూసిన మీ యువత బాగా చర్చించుకొని  ఇది సమాజానికి ఎంతవరకు పనికి వస్తుంది  పోనీ ఆ కార్యక్రమంలో మంచి జరుగుతుందా  అన్న విషయాలను కూలంకషంగా ఆలోచించి  మీరంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి  ఆ విషయాన్ని  మీరు చర్చించిన సమీక్షించిన విషయాలను పత్రికలకు రేడియోలకు మాధ్యమాలకు పంపి  సంస్కరణ పద్ధతి కి నాంది పలకాలి  దీనివల్ల మీకు మేధాశక్తి పెరగడంతో పాటు  సమాజంలో ఏం జరుగుతుందో  అది హితాన్ని గురించి చెప్పినదా కాదా అన్న విషయాన్ని కూడా గమనించి  దానిని గురించి కూడా మీ అభిప్రాయాలను సమీక్షలను రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సమాజానికి.
ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు  దేశానికి ఎంతో ఉపయోగపడుతున్న  రైతు సోదరుల సంక్షేమాన్ని, క్షేమాన్ని విస్మరించి  మిగిలిన కార్యక్రమాలను గురించి వారు  ఆలోచిస్తూ ఉండడం  అనవసరమైన వాటికి  ప్రాముఖ్యత ఇచ్చి ఏది జీవనాధారమో దానిని వదిలేస్తే  రాబోయే తరం ఎన్ని అగాచాట్లకు గురి అవుతుందో  మానసిక విశ్లేషణ తో కూడిన విమర్శలను  పత్రికల ద్వారా తెలియజేసినట్లయితే  వారిలో ఏ కొంచెం మార్పు అయినా రావడానికి అవకాశం ఉంటుంది  ఇవాళ రాజకీయాలు దేశాల గురించి కాకుండా వ్యక్తిగత ఆరోపణలతోనే కాలుష్యం చేస్తున్నారు  ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు  వీరి గురించి చెప్పినప్పుడు  వారి అభిమానులు వారి గురించి చెప్పినప్పుడు వీరి అభిమానులు ఆనందించడం తప్ప  సమాజానికి ఏ మంచి జరగదు  కనుక యువత  ఎంతో ఆలోచించి యువసేనగా  బృందాలుగా ఏర్పడి  ఎప్పటికక్కడ రైతులను  విద్యార్థికులను పిలిచి విషయాలను వారికి అర్థమయ్యేలా చెబితే  సంఘానికి  ఉపకారం చేసినట్లు అవుతుంది. ఇవాళ యువతకు ఉన్న ప్రాధాన్యత ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు వారు దానిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఈ విషయాలన్నిటినీ అవగాహన చేసుకున్న  యువ రైతు  వరుణ్  ఇలాంటి మంచి పనులు జరగడానికి ఎవరి తోడ్పాటు కావాలో వారితో సంప్రదించి వారి ద్వారా కార్య సాధన  చేయడం కోసం ప్రయత్నించడం  చాలా ఆనందించవలసిన విషయం  భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను  ఎలాంటి మార్పులు లేకుండా ఏమైనా కొత్త విషయాలను చేర్చవలసి వస్తే దానిని కూడా కలుపుకొని  ముందుకు వెళితే  యువత ఎందుకు పనికిరాకుండా పోతుంది  అని వాపోయే వృద్ధ తరానికి  అది ఒక పాఠంగా ఉంటుంది  బాగా ఆలోచించండి  మీరు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆచరించండి  ఇది ఒక్కరితో జరిగే పని కాదు సమష్టిగా చేయవలసినది  అది జ్ఞాపకం ఉంచుకుంటే చాలు.కామెంట్‌లు