ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (34);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ప్రణాళికాపత్రమైన జీవితానికి కట్టుబడిన వ్యక్తి  కోటిరెడ్డి  పొలం కొన్నారు  అది పనికిరాదని తెలుసు  దానిని బాగు చేయడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పట్టవచ్చు.  ఈ రెండు సంవత్సరాల్లో  తాను భార్య  కొడుకు కూతురు  జీవం కోసం  మార్గాన్ని వెతకవలసి వచ్చింది. ఏ మనిషికైనా  అవసరం  ఆలోచనలను రేకెత్తిస్తుంది  దానికి పద్మజ భార్యగా తన వంతు  బాధ్యతను స్వీకరించి  భర్త అడుగుజాడల్లో నడుస్తూ  ఎలాంటి వెలితి కూడా లేకుండా కాలం గడపడం కోసం  ఏం చేయాలి అని ఆలోచించారు. వేరే ఆదాయం లేదు  పిల్లలు పసివాడు  ఇంటిదగ్గర ఆస్తులు ఉన్న  తనకు సహకరించడానికి సాయపడడానికి  అనేకమంది ఆత్మీయులు బంధువులు ఉన్నా ఎవరి సాయం కోరక  స్వయం కృషిని నమ్ముకున్న వారు కోటిరెడ్డి దంపతులు. రైతు జీవనం పాడి పంటల మీద ఆధారపడి ఉంటుంది  అన్న విషయం తెలుసు  ప్రస్తుతం పంట మీద ఆశలు లేవు  దానికి పెట్టుబడి పెట్టాలి తప్ప  ప్రస్తుతం ఫలితాలు  ఇవ్వలేదు కనుక వారి దృష్టి  పాడి పై పడింది. అప్పటికే రెండు ఆవులు రెండు గేదలు  ఇంట్లో ఉన్నాయి  వాటిపై శ్రద్ధ పెట్టి  వాటి పాలతో  ఇంటి ఖర్చులు  జరిగేలా ఏర్పాటు చేసుకున్నారు  భార్యాభర్తలు ఇద్దరూ  శ్రమించి ఫలితాన్ని  పొందారు. తర్వాత ఆవులను గేదెలను  అభివృద్ధి చేసి  దాని ద్వారా జీవితాన్ని హాయిగా గడుపుతూ  చాలామందికి ఆదర్శ  దంపతులుగా నిలిచారు  దానితో  అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగినాయి.  ఆత్మీయ స్నేహితుల  పరిచయం వల్ల గ్రామానికి సంబంధించిన విషయాలను వాటిని  సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు.
పెద్ద రైతులు కూడా అర్ధరాత్రి అనకొండ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అతిధి మర్యాదలు పొందుతారు.  ఒకవేళ కోటిరెడ్డి ఊర్లో లేడు అని తెలిసినా రెడ్డి గారు లేక పోయిన అమ్మగారు ఉన్నారు మన కడుపులు నింపుతారు అన్న దృష్టితో వస్తారు. వాళ్ళు అనుకున్నట్లుగానే సకల మర్యాదలు  ఉంటాయి. ఇలా ప్రజాసేవ కార్యక్రమాలలో నిమగ్నమై అందరి మెప్పును పొందుతూ వాడు కూడా దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ  హాయిగా జీవితం  గడుపుతున్న వారి కృషి మరింత గట్టిపడి మరిన్ని సంసారాలను నిలబెట్టే ప్రయత్నం చేయాలి అనేదే నా కోరిక.

కామెంట్‌లు