ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (37);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 ఇంటి అవసరాలను దృష్టిలో పెట్టుకున్న గృహిణిగా  పూటకు సరిపడినవి  టమోటా పచ్చిమిర్చి సొర బీర  పొట్ల పాదులతో పాటు  రెండు మూడు రకాల ఆకుకూరలను కూడా  పండిస్తూ  కూరల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా  గుట్టుగా కాపురం చేస్తున్న గృహిణిగా  మంచి పేరు పొందింది పద్మజ. స్త్రీ కూలీలు  వచ్చినప్పుడు వారితో మాట్లాడడం  వారు చేయవలసిన పనులు వారికి కేటాయించడం  దగ్గర ఉండి  వారితో ఆ పనులు చేయించడం  ఆమె చేస్తూ ఉండడం వరుణ్  వ్యవసాయ పనులు అన్నిటిలోనూ  అనుభవం సంపాదించి నారు పోయడం దగ్గర నుంచి కుప్పనూర్పుల గడ్డి ఇంటికి వచ్చేంతవరకు  ప్రతి విషయంలోనూ తాను జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.   ఎలాంటి భేద భావం లేకుండా  కూలీలను కూడా  ఎంతో మర్యాదగా చూస్తూ వారితో  తనకు కావాల్సిన పనులు చేయించుకోవడంలో లౌక్యంగా వ్యవహరించడం అలవాటు చేసుకున్నాడు. చేను ఇల్లు ఒకే ప్రాంగణంలో ఉండడంతో  పని మనుషుల అవసరం లేకుండా పోయింది  జిప్సీ పేరుతో  చక్కటి అందమైన కుక్క పిల్లని పెంచి  దానితో ఆటలాడుకోవడం  రాత్రులు జిప్సీ పిల్లలతోనే  గడుపుతుంది  ఇంట్లో పసిపిల్లలాగా పెరుగుతూ  బయట ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు  వెంటనే పిల్లలకు  ఆ విషయం చెప్పడం  తన పద్ధతిలో చేస్తూ పోతోంది  దానితో  దానిపై ప్రేమ మరీ పెరిగింది  దానికి కావలసిన భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే  వీరు భోజనాలు చేయడం  అలవాటైపోయింది  అది మరణించిన రోజు నుంచి  దాదాపు రెండు మూడు నెలలు  పిల్లలకు మనసు మనసులో లేదు  ఇంకే జంతువును పెంచడానికి మనస్కరించలేదు.
రైతుల కోసం పోటీ ఏర్పాటు చేసిన సభల్లో  లేదా సమావేశాల్లో  తనకన్నా ముందే వెళ్లి అక్కడ ఏర్పాట్లు అన్నీ దగ్గర ఉండి చేసి  రైతులు వచ్చేసరికి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తాడు  ఎప్పుడూ వేదిక పైకి వెళ్లి  ఉపన్యాసాలు ఇవ్వలేదు కానీ  పెద్దవారు మాట్లాడిన ప్రతి విషయాన్ని  మనసుకు పట్టించుకుని  దానితో  నిర్మించి ఇంకా చేయవలసినది ఏమిటో  దానికి సంబంధించిన విషయాలు తనకు తెలియకపోతే నాన్నగారిని అడిగి తెలుసుకుని  పంట దిగుబడి ఎక్కువ రావడానికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి  కోటిరెడ్డి పాతిక బస్తాలు పండిస్తే వరుణ్ 30 బస్తాలు పండిస్తున్నారు  జీవితంలో ఎవరైనా కష్టపడి పని చేసినప్పుడు దాని ఫలితం  సక్రమంగా ఉంటుంది  మంచి ఫలితాలను పొందుతారు.


కామెంట్‌లు