ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (38);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 చిన్నప్పటి నుంచి వరుణ్ కి  క్రికెట్ ఆట అంటే ఎంతో ఇష్టం  వాళ్ల నాన్నతో బ్యాటు కూడా  కొని పెట్టుకొని తన మిత్ర బృందాన్ని పోగుచేసి  వారితో ఆడుతూ ప్రతిరోజు విజయాన్ని సాధించేవాడు. ఎవరు ఏ ఆటలో ప్రావీణ్యం ఉన్న  అది నిజ జీవితంలో  తనకు ఎంతో అవసరం అవుతుంది  దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా  జీవితంలో క్రమశిక్షణ కూడా అలవాటవుతుంది  ఎప్పుడు క్రమశిక్షణ తన చేతిలో ఉంటుందో అప్పుడు తాను సాధించదలచిన ప్రతి విషయాన్ని తప్పక  సాధించి తిడతాడు వరుణ్ గారి అబ్బాయి చేతన్ తన తాత గారికి చాలా ఇష్టం  రాత్రి మొత్తం ఆయనతోనే కాలుక్షేపం చేస్తూ ఉంటాడు.  కోటిరెడ్డి వెళ్లే ప్రతి సభకు వాడిని  తప్పకుండా తీసుకవెళ్లవలసినదే  అక్కడకు వచ్చే వారందరూ వాడికి బాగా పరిచయం. నాన్నగాని, తాతగారు గాని పొలం వెళ్ళినప్పుడు  తను కూడా వెంట వెళ్లి వారు  చేసే పనులను గమనిస్తూ  వారికి సహాయం చేస్తూ ఉంటాడు. కూరగాయలు కోయడం దగ్గరనుంచి ప్రతిదీ ఒక్కడే చేయగల నేర్పును పొంది  చదువులో కూడా మంచి  మార్కులతో ఉపాధ్యాయుల మెప్పు పొందుతూనే ఉంటాయి  సాయంత్రం కాగానే  చెల్లిని కూడా తీసుకొని  నాయకుడు లాగా అందరిని పోగు చేసి ఆటలోనే నిమగ్నమైపోతారు. వాళ్ల అమ్మ భోజనానికి పిలిచేంత వరకు వారికి ఆ ఆలోచనే రాదు. వాడికి పిల్లలు దొరకక పోతే చెల్లితో పాటు అమ్మని, నాయనమ్మని పిలిచి చెల్లితో వాడి విన్యాసాలను చూపిస్తాడు. ఏ కుటుంబంలో అయినా కుటుంబ పెద్ద ఏది చేస్తూ ఉంటే పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు  అది అందరికీ తెలిసిన విషయమే  విద్యావంతుడై కూడా  వ్యవసాయదారులకు ఆదర్శప్రాయంగా  ఆ కుటుంబం నిలవడం అనేది  చాలా తక్కువ కుటుంబాల్లో కనిపిస్తుంది  అలా కోటి రెడ్డి మూడు తరాల వారసులకు ఆదర్శప్రాయంగా నిలవడం  గొప్ప విశేషం. వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది రైతు సోదరులను కలిసి వ్యవసాయ శాఖలో ఉద్యోగుల నుంచి తెలుసుకున్న విషయాలను అవగాహన చేసుకొని దానికి మరికొంత తన అనుభవ సారాన్ని కలిపి వారిని అనుసరించేలా చేయడం ఆయన పని.అందుకు వారిని తప్పక అభినందించి తీరవలసినదే. అలా రైతు సోదరులందరికీ ఆరాధ్యుడయ్యాడు.


కామెంట్‌లు