మన గురువు ప్రకృతి (4);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనకు ఎందుకూ పనికిరాని ఎండుగడ్డిని  తిని మనకు  దాని జీవితాంతం  సేవ చేస్తూనే ఉంటుంది ఎద్దు. మనిషికి స్వార్థం ఎక్కువ  ఆశాజీవి  దానితో ఎవరు ఏ సహాయం మనకు అందించినా  ఆ సందర్భం దాటిన తర్వాత ఆ విషయాన్ని కూడా మర్చిపోతాము  ఆ సాయం చేసే మనిషి కూడా జ్ఞాపకం ఉండడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు  వినడానికి సొంపుగా ఉండేలా మాట్లాడాలి  అంతే తప్ప అధికారాన్ని చలా ఇస్తున్నట్లుగాను లేదా నీలో నీవు గొణుక్కున్నట్లుగాను  మాట్లాడకూడదు మనం గానాన్ని ఆస్వాదించాలి అంటే  చిలుకలను జ్ఞాపకం చేసుకుంటాం. దానిలాగా సున్నితంగా వినడానికి ఇంపుగా ఉండేలా మాట్లాడితే  నీవు ఏది చెప్పినా చివరకు తనకు ఇష్టం లేని విషయాలు కూడా  తప్పకుండా వింటారు.
ఇవ్వడం మనం  సమాజంలో సహజంగా చూస్తూ ఉంటాం  ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినప్పుడు  మన శాస్త్రజ్ఞానం గొప్పతనం చూస్తున్నారు కదా. ఇలాంటి ఆలోచనలు భారతీయులకు తప్ప మరి ఎవరికి రావు అన్న   చిన్న విషయం నుంచి అతిపెద్ద యంత్రాల వరకు తయారు చేసేది  మన ఆంధ్రులు మాత్రమే  అని గొప్పలు చెప్పుకోవడం చూస్తూ ఉంటాం  రామాయణ కాలంలో రావణాసురుడు  ఆకాశయానం విమానంలో చేస్తూ ఇతర దేశాలకి వెళ్లేవాడు  అని తెలిసిన వారు ఎవరైనా  ఇది ఆంధ్రుల ప్రజ్ఞ అని చాటగలరా? అప్పటికే అధునాతన పరికరాలన్నీ వున్నాయి  అని చెప్పే వేద వాంగ్మయం చదివిన వారు ఎవరైనా  వారిని చూసి చాలా చులకనగా మాట్లాడడం తప్ప  మరి ఏమి చేయలేని స్థితిలో ఉంటారు  మన ఆంధ్రదేశంలో మన భాష  తప్ప మరో ప్రాంతానికి మరొక దేశానికి వెళ్ళదు  కనక మన గొప్పతనం వారికి తెలియదు అని సరిపెట్టుకోవాలి. సూర్యునిలో ఉన్న గుణాలను చంద్రుడిలో ఉన్న  గుణాలను కనిపెట్టడం కోసం  అనేక వేల కోట్ల డబ్బు ఖర్చు చేస్తున్నారు  ఏవైనా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారా  ఖగోళ శాస్త్రం చదివిన వారికి  గ్రహాలు నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయో దేని తర్వాత ఏది ఎలా ఉద్భవించిందో  నవగ్రహాల చరిత్ర మొత్తం చెప్పగలిగిన మన సనాతన సాహిత్యం చదివిన వారికి ఇలాంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది  సూర్యని కాంతి అంత వేడిగా  గ్రీష్మరుతువు అయితే మనం భరించలేనంత ఎండ. అదే చంద్రుడు వెన్నెల కాస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది ఎంత చల్లగా ఉంటుంది  దీని కారణాలు ఏమిటి అని  మనవాళ్లు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటారు  వాటి స్థితిగతులన్నీ  ఇంతకుముందే వ్రాయబడి ఉన్నాయి  ఋషి ప్రోక్తమైన  సాహిత్యం చదివిన వారికి ఆ విషయాలు తెలుస్తాయి  అంతేకానీ మిడిమిడి జ్ఞానం  కడిగిన వారికి ఎలా అర్థమవుతుంది...?



కామెంట్‌లు