రెడ్డి రాజులు (4);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చూడండి అమ్మ వీరనారి జీవిత చరిత్రలను వారి పరిపాలనా దక్షతను  మీకు తెలియజేయాలి అంటే  ముందు  ధర్మ రక్షణ చేయడం కోసమే రాజ్య పరిపాలకులు ఉన్నారు అన్న విషయం స్పష్టం చేయాలి  ఆ ధర్మాన్ని గురించి తెలిసిన తరువాత  మన నారీమణులు ఆ ధర్మాన్ని ఎలా పాటించారో మీకు తెలుస్తుంది  ఈ ధర్మాన్ని తెలుసుకోవాలంటే  ప్రపంచ ప్రజలకే ధర్మాన్ని ప్రబోధించిన వాల్మీకి మహర్షి  తన రామాయణ గ్రంథంలో చెప్పిన విషయాలను మీకు  మీ చిన్న హృదయాలకు తెలిసేలా చెప్పాలి అసలు రామాయణం ఎందుకు రాయవలసి వచ్చింది. ఆ గ్రంథంలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏమిటి? ఈ రామాయణం చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగం  ఏమైనా ఉన్నదా అన్న విషయాలను అవగాహన చేసుకోవడం కోసం ఆ వాల్మీకి మహర్షిని ఒక్కసారి స్మరించుకుందాం. అడవిలో వేటాడుతూ  ఆ ప్రాంతాలకు వచ్చిన  బాటసారుల నుంచి  వారి దగ్గర ఉన్న సొమ్ములన్నీ దొంగతనం చేస్తూ వేటాడి ఆ పక్షుల మాంసంతో కడుపునింపుకునే కుటుంబంలో  హాయిగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నారని, సుఖిస్తున్నారని అనుకున్న ఒక అజ్ఞాని  కి అదృష్టవశాత్తు  నారద మహర్షి  ఆ అడవి ప్రాంతానికి వచ్చి  ఈ వేటగాని చేతికి చిక్కాడు.  నీ దగ్గర ఉన్న వస్తువులను నేను  దొంగిలించాలనుకుంటున్నాను  అనగానే చూడు నాయనా  నా దగ్గర ఈ మహతి అన్న తంబురా తప్ప మరేది లేదు  ఇది నీవు తీసుకు వెళ్లినా నీకు ప్రయోజనం లేదు  అయితే ఒక విషయానికి సమాధానం చెప్పు  నీవు చేస్తున్న ఈ పనులు దొంగతనం  వేట తప్పులు కదా  దానికి పాపాన్ని అనుభవించాలి కదా  ఈ అనుభవించే దానిలో నీ భార్య కూడా పాపం తీసుకుంటుందేమో ఒక్కసారి తెలుసుకుని వచ్చి నాకు చెప్పు నేను ఇక్కడే ఉంటాను మరి ఎక్కడికి వెళ్ళను  అనగానే వేటగాడు ఇంటికి వెళ్ళాడు.
వెళ్లి వెళ్ళగానే భార్యను ఒకే ఒక ప్రశ్న  నేను చేసిన ఈ పాపాలలో నీవు భాగం పంచుకుంటావా లేదా  తక్షణం నాకు సమాధానం కావాలి అంటే  ఆ మహా పతివ్రత ఏమాత్రం వెనకాడకుండా చూడండి మీరు ఎలా వివాహం చేసుకున్నారు  మన కుటుంబం గడపడం కోసం  మీరు ఎలా సంపాదించి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నేను ఏ క్షణాన మిమ్మల్ని అడిగిన పాపాన పోలేదు  ఒక గృహిణిగా మీరు తీసుకువచ్చిన ప్రతి వస్తువును  కుటుంబానికి పనికి వచ్చేట్లుగా  చేయడమే నా పని  నేను చేస్తున్న నా పనులలో నేనెప్పుడూ అశ్రద్ధ చూపలేదు  కనుక నేను చేసిన పనులలో ఏ పాపం లేదు, మీరు చేసే పాపపు పనులలో నేను ఏమాత్రం పంచుకోను  ఆ అవసరం కూడా నాకు లేదు అని చెప్పింది. ఆ వేటగాని మనసు విరిగిపోయింది  పరుగు పరుగున వచ్చి  నారదల వారి పాదాలను ఆశ్రయించాడు  అది అతని జీవితానికి మలుపు.కామెంట్‌లు