మన ఆకాశవాణి (5);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నాటక శాఖ తీసుకున్నట్లయితే  ప్రొడ్యూసర్ (నిర్వాహకులు)  అన్న పేరుతో ఆ ఉద్యోగం ఉంటుంది  విజయవాడ కేంద్రానికి సంబంధించి బందా కనక లింగేశ్వర రావు గారిని  ఎన్నిక చేశారు  వారు రంగస్థలంపై కృష్ణ పాత్రకు  మంచి పేరు సంపాదించి పెట్టారు. అటు రంగస్థలం నాటకాల లోను  ఇటు సినీ రంగంలోనూ తన ప్రజ్ఞాపాట వాలను ప్రదర్శించిన వారు లా చదివి కొంతకాలం లాయర్ వృత్తి కూడా చేశారు  నాటక దిగ్గజం బళ్ళారి రాఘవాచార్యులు గారి శిష్యరికంలో  అనేక పాత్రలు ధరించి వారి చేతనే శభాష్ అనిపించుకున్న నటుడు. అలాగే స్థానం నరసింహారావు గారిని హైదరాబాద్ కేంద్రంలో నియమించారు.  స్త్రీ పాత్రలు ధరించడంలో ఆయనకు మించిన స్త్రీలు మరొకరు లేరు  అని ఆ రోజుల్లోనూ ప్రఖ్యాతి చెందినవారు. వీరికి నాటక అనుభవం ఉండటం వల్ల  అన్ని రకాల నాటకాలకు న్యాయం చేయగలరు అన్న దృష్టితో వారిని ఏర్పాటు చేశారు. బందా గారు  నాటక శాఖ చేపట్టిన తర్వాత  మొదట కొన్ని బృందాల వారి నాటకాలను గంటకు కుదించి వాటిని ప్రసారం చేస్తూ ఉండేవారు. తరువాత తాను వేదికపై ప్రదర్శించిన నాటకాలను గంటకు కుదించి వాటిని బందానే స్వయంగా నిర్వహించేవారు  ఆ తర్వాత కొంతమంది  నాటక రచయితలను ఎన్నిక చేసుకొని  వారిని పిలిపించి వారికి  తనకు నచ్చిన నాటక విషయాన్ని చెప్పి దానిలో ఎంతవరకు కావాలో అంతవరకు గంటకు కుదించి రాయమని దానికి కావలసిన నియమ నిబంధనలను అన్నిటినీ తెలియజేసేవారు. ఆ తర్వాత కొంతమంది  నటీనటులను  ఆహ్వానించి వారిలో  ఆకాశవాణికి సరిపడిన గొంతులు ఉన్నవారిని ఎన్నిక చేసి వారు ద్వారా నాటకాలను  నిర్వహిస్తూ ఉండేవాడు.
ఆ తర్వాత నాటక శాఖలో కొంతమంది నిలయ కళాకారులను ఎన్నిక చేశారు వారులో సి.రామ మోహన్ రావు గారు, నండూరి సుబ్బారావు గారు, ఏ.బి ఆనంద్ గారు సంగీత కళాకారిణిగా వున్న వి.బి కనకదుర్గ గారు కూడా చాలా నాటకాలలో  కథానాయిక పాత్రల ద్వారా శ్రోతలకు పరిచయమయ్యారు. అలా చాలా నాటకాలు కొన్ని అత్యవసర సమయాలలో బందా గారు కూడా తమకు తగిన పాత్రను ఎంపిక చేసి దానిలో తమ గాత్రాన్ని వినిపించారు. ఏ.బి ఆనంద్  గారు ఆకాశవాణికి వచ్చిన తర్వాత  అన్నపూర్ణ నుంచి వారు పదవి విరమణ చేసేంతవరకు  నాటక శాఖలో  కథానాయకుడిగానే నటించాను. ప్రస్తుతం నటిస్తున్నాడు కూడా. ఇలా నాటక శాఖను అభివృద్ధి  చేసిన ఘనత ఒక్క బందా గారికే దక్కుతుంది  తరువాత ఎంతమంది వచ్చినా  వారిని మించి చేసిన వారు మరెవరు లేదు  అనడంలో అతిశయోక్తి లేదు.


కామెంట్‌లు