రామాయణం ; -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి :- 6300474467

"నేడు శ్రీరామనవమిపర్వదినమును పురస్కరించుకుని శ్రీమద్రామాయణకావ్యమును రచియించి , ఆ కావ్యవైశిష్ట్యమును అత్యద్భుతంగా వివరించిన ప్రాచీన,  ఆధునిక విద్వత్కవివరేణ్యులకు సవినయనమస్సుమాంజలిఅర్పిస్తూ వారిని గురించి విరచించిన  సీసమాలిక"!!!
==========================================
ఆదికావ్యమనంగనవతరించియుతాను
వాల్మీకిచేతిలోవాసికెక్కె
కవికులగురువర్యుకాళిదాసాఖ్యుడు
రఘువంశమనుపేరరాశిపోసె
తిక్కన్నశైలిలోతియ్యందనము నిర్వ
చనమయ్యినిలిచెనుశాశ్వతముగ
ద్విపదలోబావుటారెపరెపలాడించి
గోనబుద్ధారెడ్డిజ్ఞానియయ్యె
భాస్కరకవులాదిభాస్వరరచనతో
చంపుకావ్యముగానుసొంపులీనె
భక్తపోతనకునుముక్తినందించిన
భద్రగిరీశుండుప్రాణమయ్యె
రామభద్రసుకవిరసమునందేలియు
రామాభ్యుదయమయ్యిరాణకెక్కె
మొల్లమ్మకందాలమల్లెలువికసించి
పరిమళములుచిందిపరిఢవిల్లె
కంకంటిపాపన్నకవనమనోజ్ఞమై
దాశరథిఘనతధన్యతగొనె
కవిరాజుభవభూతికమనీయనాటక
ప్రక్రియయైనిల్చెవసుధయందు
గోపన్నపాళిలోగోరుముద్దలుతిని
శతకమైయలరారెసంభ్రముగను
పూనియురచియించెనేనుగులక్ష్మణ
రామవిలాసమురమ్యమలర
కల్పవృక్షమ్ముగాకడుతీర్చిదిద్దిన
విశ్వనాథునికీర్తివినుతికెక్కె
శేషేంద్రకవివర్యుశేముషీవ్యాసాలు
తరగనినిధులుగావరములయ్యె
(ఆ.వె.)
వేలవేలకవులవిన్యాసములలోన
రామకథయెమిగులరక్తికట్టె
కావ్యఘనతచాటికనువిందుసేయగా
చదువముక్తిదొరుకుసర్వులకును!!!





కామెంట్‌లు