వైద్యానికి వేప;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 ఏ వస్తువైన పిల్లలు చూసే దృష్టి వేరు  పెద్దల దృక్పథం వేరు ఉదాహరణకు వేపాకును తీసుకున్నట్లయితే  వేప, వేప చెట్టు అన్న మాటలు వినగానే  ముందు పిల్లలకు జ్ఞాపకం వచ్చేది చేదు. కనుక ఆ ఆకు జోలికి ఎవరు వెళ్ళరు  కానీ మన ఆహార పదార్థాల్లో  పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన షడ్రసోపేత భోజనం కావాలి అంటారు  ఆరు రుచులు తినాలి దానిలో వచ్చేది కూడా తప్పక చేదు ఉండాలి. రోజు మీరు గమనించినట్లయితే  ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో రెండు వేపాకులను నమిలి తినండి. దాని ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది  ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్కల్లో వేప చెట్టు ఒకటి  ఇది  తెలియని వారు ఉండరు అంతే కాదు  ఈ వేప చెట్టు గాలి సోకినా కూడా మన ఆరోగ్య సమస్యలన్నీ తొలిగి పోతాయి. ఈ చెట్టు నీడ కూడా చాలా చల్లగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వేప చెట్టును ఔషధంగా ఉపయోగిస్తున్నాము  వేప ఆకులు చేదుగా ఉన్నప్పటికీ వాటిలో వాత లక్షణాలను  క్రమబద్ధీకరించే శక్తి ఉంది  అలాగే రక్తంలో ఉండే వ్యర్ధ పదార్థాలను మలినాలను తొలగించే గుణం కూడా ఉంది  శరీరం నుంచి  ఫ్రీ రాడికల్స్ ను తొలగించే ప్రక్రియను వేపాకులు వేగవంతం చేస్తాయి  వేపాకులను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు  శరీరంలో వాపులను, జ్వరాలను, చర్మ సంబంధిత సమస్యలను దంత సమస్యలను జీర్ణ సమస్యలను  తరిమి వేయడంలో వేప చెట్టు మనకు ఎంతో సహకారిగా ఉంటుంది  పాతకాలంలో అంటే సమస్యలతో బాధపడే వారి వద్ద  వేప ఆకులనుంచే వారు  అలాగే ఇంటికి తోరణాలుగా కూడా వేప ఆకులను కడతారు  దీనివల్ల ఇంట్లోకి వచ్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది  క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి  ప్రత్యేకించి లేత వేపాకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత వేప ఆకులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్  అదుపులో ఉంటుంది  రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం  అలాగే మధుమేహ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అనుకున్న వారు కూడా దీనిని తినాలి  దానివల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి  గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి  పొట్ట ప్రేగులు శుభ్రపడతాయి వేపాకు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సూది మందుల బారిన పడకుండా చేస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులకు ఇది మంచి మందు. వేపాకులను పేస్టుగా చేసి దానిని తలగు పట్టించడం వల్ల జుట్టు సంబంధించిన జబ్బులు తగ్గి జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. వేపాకు కషాయాన్ని ఇంట్లో ఉంచడం వల్ల క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి  అయితే గర్భిణీ స్త్రీలు  ఈ వేపాకులకు దూరంగా ఉండాలి  ఇది వైద్య వృత్తిలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే  ఈ సలహా ఇస్తున్నాను ఆచరించి చూడండి మీకే తెలుస్తుంది.

కామెంట్‌లు