రెడ్డి రాజులు (7);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మన తరగతి  లో ఉన్న వారందరూ బాలికలే కనుక  రామాయణంలో ఉన్న  స్త్రీ పాత్రలు ఏమిటో ముందు తెలుసుకుందాం  రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి వేటి ప్రత్యేకత వాటివే  ఎవరి వ్యక్తిత్వం వాడిదే రామాయణంలో ఉన్న స్త్రీ పాత్ర గురించి తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయం  రాజలతో వానర రాక్షస సాధారణ జనసమూహాలకు చెందిన పాత్రలు ఉన్నాయి  ఆ పాత్రలను అధ్యయనం చేసి  ఆ పాత్రలను మిగిలిన పాత్రలతో పోల్చి చూడడం  ఇంతవరకు ఎవరైనా చేశారా  అది మనం చేద్దాం. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే మహాభారత రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథమే.
నాలుగు రకాలైన  మనుష్యులు చేయవలసిన ధర్మాన్ని బోధిస్తుంది కనుక  ఇతిహాసము అన్నారు. ఇది జరిగినది అని అర్థం. వాల్మీకి మహర్షి చేత వ్రాయబడింది కనుక ఆది కావ్యమని కూడా అంటారు  ఈ గ్రంథం శ్రీరాముడి చరిత్ర రామాయణం  అని రావణుని వధ గురించి చెప్తున్నది కనుక  పౌలస్త్య వధ అనడం చేత చరిత్రను వర్ణిస్తుంది కనుక శీతాయాచ్ఛరితం అని పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ మానవ వానర రాక్షస పాత్రలు ఉన్నాయి వాటిలోని స్త్రీ పాత్రకు సంబంధించిన వివరాలు  మనం తెలుసుకుందాం. వాల్మీకి రాసిన ప్రతి  పాత్ర లక్షణాలు  ఆ పాత్ర పేరు చదవగానే  మనకు తెలిసిపోతుంది  అంత ప్రజ్ఞా పాటవాలు గలిగిన మహానుభావుడు వాల్మీకి మహర్షి కనుక వారిని ఆదికవిగా అభివర్ణించారు ఆ పేర్లు వివరాలను చూద్దాం
మొదట ఆంజనేయుని తీసుకుంటే  వీరు అంజనాదేవి కుమారుడు. ఆమె కుంజరుని కుమార్తె వానర స్త్రీ  కేసరి భార్య  కంటిలో అంజనం వేస్తే కంటిలో ఉన్న అన్ని రుగ్మతలు  పోతాయి. ఎంత దూరమైనా చూడగలుగుతాం. అది ఆంజనేయ స్వామికి తన తల్లి ఇచ్చిన వరం. అనసూయ ఆమె అత్రి మహర్షి భార్య  సీతారాములు అరణ్యవాసానికి వెళుతున్న  సమయంలో  సాక్షాత్తు శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి  మహా పతివ్రతయే ఆమెను కలిసి పతివ్రత ధర్మాలేమిటో చెప్పమని అడిగినప్పుడు  ఆమె చిరునవ్వుతో అన్ని విషయాలు చెప్పింది  అనసూయ అంటేనే అసూయ లేనిది  ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండవు  అత్రి మహర్షి భార్య  అత్రి అంటే న త్రి  మూడు లేవు ఉన్నది ఒకటే అని చెప్పేది.


కామెంట్‌లు