స్వార్థచింతన వదలాలి;-" కావ్య సుధ ""ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"9247313488 హయత్ నగర్, హైదరాబాదు
 ప్రపంచంలో నేడు కనిపించే అనేక సమస్యలకు మూలం స్వార్థం నేను లక్షాధికారిని అవ్వాలి అనే కోరికతో  ఇతరులను దోపిడీచేయడం మొదలవుతుంది. నా జాతి, నా దేశం అన్నిటి కన్నా గొప్పదనిపించుకోవాలన్నా కోరిక యుద్ధాలకు దారితీస్తుంది.
ఉన్నదానిని ఇతరులతో కలిపి పంచుకోలేక పోవటమనే లోపం పతనానికి దారితీస్తుంది.
దీనికి ఉదాహరణ దుర్యోధనుడి ఆలోచన, తన సామ్రాజ్యంలో కేవలం ఐదు గ్రామాల మీద పెత్తనం సహోదరులకు ఇచ్చేందుకు మనస్కరించక సర్వనాశనం కొనితెచ్చుకున్నాడు. ఇదే నేటి కొన్ని దేశాలకు, వాటి నాయకులకు వర్తిస్తుంది.
గీతాసారం. అర్థంచేసుకున్నవారికి అహం దరిచేరదు. ఎలా జీవించాలి. ఎలా ప్రేమించాలి. చివరికి ఈ లోకం ఎలా వదిలివెళ్లాలో తెలిపింది గీత, చావు,  పుట్టుకలనేవి మన చేతిలో లేనివి. ఆమధ్య కాలాన్ని మంచికి ఉపయోగించమని చెప్పేదే గీతా సారాంశం.

కామెంట్‌లు