మన శోభకృత్ ఉగాది!;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
నేడే ఈనాడే శ్రీ శోభకృత్ ఉగాది
ఈడేరే మన మది కోర్కెల పునాది
సంవత్సరానికి ఒకసారి వస్తుంది
సుఖ సంతోషాల సిరిని అందిస్తుంది

మామిడి తోరణాలతో ఆహ్వానం పలుకుదాం
అత్తరు పన్నీరులతో వాకిళ్లను అలుకుదాం
ముత్యాల ముగ్గులేసి మనమంతా కులుకుదాం
మన ఆనందోత్సాహాలను లోకానికి తెలుపుదాం!

అరుదించిన ఈ శోభకృత్ ఉగాది పండుగ
మనల దీవించి శుభాశీస్సుల అందించును నిండుగ
ఇడుముల తొలగించి ఉండును మనకు అండగ
సుఖ నిద్రను కలిగించే తలగడ దిండుగ!

కుహు కుహు రాగాలను కోయిలమ్మ కూస్తుంది
పచ్చదనంతోని ఇక వనమంతా పూస్తుంది
ఆశల మోసుల ఊసులతో ఆవిరినందిస్తుంది !
". ఆనందాల హరివిల్లై మన లోగిళ్ళకు వస్తుంది"

మన ఉగాది పచ్చడి షెడ్రుచులను ఆరగిద్దాం
ఉగాది కాంత విగ్రహాన్ని ఊరేగిద్దాం
శోభకృత్ శోభాయాత్రను ప్రారంభిద్దాం
వచ్చేసిన విచ్చేసిన భక్త జనావళిని ప్రేమిద్దాం !

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుదాం
సనాతన సాంప్రదాయాలను మనం నిలుపుదాం
పచ్చడి రుచులతో మన గొంతులను తడుపుదాం
వచ్చెడి అతిథులతో కాలాన్ని మనమంతా గడుపుదాం !


కామెంట్‌లు