మన రామాయణం!;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్ 9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మహాకవి మన ఋషి వాల్మీకి
కవిత్వ జలనిధిలోకి తను దూకి
వ్రాసెనుగా శ్రీ రామాయణ గ్రంథం
అను సీతారాముల ప్రేమ ప్రబంధం!

ఇల వెలసిన రసరమ్య రామాయణం
రామమయం అయిన ఆయనం
రఘు రాముడు నడిచిన మార్గం
ఐ వర్ధిల్లెను మన పాలిటి స్వర్గం !

మానవ రూపంలో అవతరించిన శ్రీరాముడు
ప్రజల హృదయాల్లో నిలిచిన మన రఘురాముడు
రామాయణంలో కథానాయకుడై నిలిచాడు
బిల్లును విరిచి సీతను గెలిచి సీతాపతి అయ్యాడు !

మన దేశంలో  రామాలయం లేని ఊరే లేదు
ఘన సందేశం లయమైన ఆయనం
కాదు చేదు
ధర్మ మార్గం ఆచరించమని ఈ గ్రంథం తెలుపు
మర్మ కర్మ స్వర్గాన్ని అందించి మన బంధాన్ని నిలుపు !

ధర్మ ప్రతిష్టాపనే రామాయణం విశిష్ట అంశం
సూర్య

చంద్రులు ఉన్నంతవరకు దీనికి లేదు స్థానభ్రంశం !
సదా జీవన మార్గదర్శియై ఇది నిలుస్తుంది
కథా కదంబమై నవజీవన పావన సంజీవై ఫలిస్తుంది !

స్మరణీయం మన ఈ రామాయణం
రమణీయమై తోడుగా నిలిచే సీతాయణం
కమనీయమైన మనందరి కావ్యాయణం
నిత్యమై సత్యమై నిలిచే మన నిత్యాయణం !

కామెంట్‌లు