మన శ్రీరామనవమి ;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తిసెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మహాకవి మన ఋషి వాల్మీకి
కవిత్వ జననిధిలోకి తను దూకి
రచించనుగా రామాయణ గ్రంథం
వచించనుగా ఆదర్శ దంపతుల
 బంధం!

రాముడు కథానాయకుడు ఇందు
సీతమ్మతల్లి కథానాయకి పసందు
కథనం విని మనం సంతోషిస్తున్నం
చెప్పుటకు మరల సాహసిస్తున్నాం!

వస్తుంది వస్తుంది శ్రీరామనవమి
మస్తుంది మస్తుంది సిరిధామం సౌధామిని
నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిళ్ళుతుంది
మూడు పువ్వులు ఆరు కాయలతో వర్ధిల్లుతుంది!

నవమి నాడు పుట్టి అయ్యాడులే దొడ్డ
తన మదిలో కేటాయించే అందరికీ అడ్డ
తను కౌసల్య దశరథుల
 ముద్దుబిడ్డ
అయోధ్య నగరం ఆయన జన్మించిన గడ్డ!

శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం
శ్రీరాముడు
రావణ సంహారం కోసం అవతరించిన సిరిధాముడు
ప్రజలందరి నాడుల్లో నిలిచిపోయిన జీవుడు
అందుకే అయ్యాడు ఆయన అందరికీ దేవుడు !

పెళ్లిరోజు పుట్టినరోజు కలిసిన రోజు
పర్వం జరుపుకొని తీర్చుకుంటారులే తమ మోజు
దేశంలో ప్రతి ఇంట జరిగేదే ఈ రివాజు
అందరి గుండెల్లో నిలిచిన ఆ రాముడే రారాజు!

వడపప్పు పానీయం చేస్తూ
భక్త జనావళి దాహం తీరుస్తూ
చేస్తారు భజనలు ఎన్నో భక్తులు
పొందేరు వారు ఇక ఎన్నో శక్తులు!

వచ్చేసిన విచ్చేసిన ఈ శ్రీరామనవమి
మెచ్చేసిన నచ్చేసిన శోభకృత్ సౌధామి
అని తలచి కలిసిమెలిసి నిలిచి చేస్తారు పండుగ
వారనక వీరనక సంతోషం పంచుకుంటారు మది నిండుగ !


కామెంట్‌లు