మనసు ముఖ్యం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఏ మనిషికైనా  శరీరంలో ముఖ్యమైన భావం వెన్నుపూసగా ఉంటుంది  శరీరంలో  గుండె దగ్గరనుంచి ఏ భాగం చెడిపోయినా  దానిని తీసి ప్రత్యామ్నాయం చేయగలిగిన సత్తా మన వైద్యులకు ఉన్నది.ఆధ్యాత్మిక విదులు చెబుతున్న విషయం  శరీరంలో వచ్చే ప్రతి ఆలోచనకు మూలం  అవి మంచి ఆలోచనలు కావచ్చు చెడ్డవి కావచ్చు  అది ఆలోచించేటప్పుడు దాని పూర్వాపరాలను గురించి ఆలోచించదు  ఒక విషయానికి సమాధానం గా తనకు కొన్ని  వందలాది ఆలోచనలు వస్తే  వాటిని చిన్న మెదడు (మెడుల్లా)కు పంపి తన బాధ్యతను తీర్చుకుంటుంది  చిన్న మెదడు దానిలో ఉన్న ముఖ్యమైన విషయాలను ఒకటి రెండు ఎన్నిక చేసి   వాటిని మెదడుకు పంపిస్తుంది  ఆ మెదడు దానిని కార్యరూపంలో పెడుతుంది.
మనసు నిశ్చలంగా ఉండదు అన్న విషయం  అందరికీ తెలిసిన విషయమే  ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే  జీవితంలో ప్రతి అనర్థానికి కారణభూతమైనది ఆ మనస్సు. తన అధ్యయనంలో లేకపోయినట్లయితే  ఆ జీవి పతనం కావడం ఖాయం.  ఒక అందమైన పడతి నడిచి వెళుతూ ఉంటే  అంతకుముందు ఆమెను ఎక్కడా చూడకపోయినా  వ్యామోహంతో ఆమెను పొందాలన్న కోర్కె మనసు మనకు  అందజేస్తుంది  దానివల్ల జరిగేది  ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం ఇతనికి ఉన్నదా  ఒకవేళ మాట్లాడడానికి వెళ్లినా ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే  సత్తా ఉన్నవాడేనా  ఈ విషయాలు ఆమె తల్లిదండ్రులకు తెలిస్తే  వాళ్లు దండించడానికి వచ్చినప్పుడు  తాను ఏం చేయగలడు  కనుక ఊహలతో  సరిపుచ్చుకోవడం జరుగుతుంది  ఇది యువతలో జరుగుతున్న  పరిస్థితి.
ఈ మనసును గురించి అనేకమంది వేదాంతులు సంఘసంస్కర్తలు  ఎన్నో విధాలుగా దానిని అధీనంలో ఉంచుకునే మార్గాలను చెప్పారు. ప్రత్యేకించి త్యాగరాజస్వామి మనసు నిల్ప శక్తి లేకపోతే  అన్న కీర్తనను అభోగి రాగంలో స్వరపరిచి  ఈ వయసులో ఉన్న వారికి జ్ఞానోదయం కలిగేలా ఆలపించారు కూడా. ఇన్ని చేసినా సహజ సిద్ధంగా ఉన్న దాని గుణం ఎలా మారుతుంది  దానికి ఎంత సాధన చేయవలసిన అవసరం ఉంది  ఆ సాధన చేయకుండా  మనసు బాధలను తప్పించుకోవాలి అనుకున్న వాడు  ఎంత మూర్ఖుడో మనకు అర్థం అవుతుంది  కనుక వేమన కూడా ఇలాంటి  పనికిరాని ఆలోచనల జోలికి వెళ్ళవద్దు  జీవితంలో ఏది అవసరమైతే దానిని మాత్రమే ఆలోచించు  మిగిలిన వాటిని ప్రక్కన పెట్టు అంటాడు  ఆ పద్యాన్ని వినండి  కాదు చదవండి.

"ఎన్నగ మనసే కారణమనిటికిన్ని చూడ జూడగ నాత్ముడు తానవ  యున్నంతకాల మెచ్చటనున్నను  ఇది నిజం తెలియనొప్పుగా వేమ..."


కామెంట్‌లు