వెతికితేనే ప్రయోజనం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనిషి దేనిని గురించి తెలుసుకోవాలనుకున్నాడు  దానిని గురించిన పరిజ్ఞానం ఉండాలి. అది ఏమిటి ఎందుకు ఎలా  అన్న ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానాలు దొరికిన తరువాత దానిని వెతికే ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి  ఎక్కడో నీ జేబులో ఉన్న  వస్తువు పడిపోయింది. అది ఎక్కడ పడింది నీకు ఎలా తెలుస్తుంది. అది ఎక్కడ పడిందో తెలిస్తే దాన్ని వెంటనే తెలుసుకోవచ్చు  ఆ వస్తువులు పొందవచ్చు  నీ వస్తువు ఎక్కడో చీకట్లో పోయిందని  ఆ కటిక చీకటిలో పోయిన వస్తువు దొరకదని  వీధి లాంతరులు  ఉన్న ప్రదేశంలో ఆ పోయిన వస్తువు కోసం వెతికితే  ఏమైనా ప్రయోజనం ఉంటుందా  అనవసర శ్రమ తప్ప  ఆ వస్తువు మనకు దక్కదు. వేదాంత విషయాల్లోకి వస్తే  తనకు తెలియని భాగవత్వ రూపాన్ని తెలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేసిన  తనకు ఆ మార్గం తెలియదు  మనకు మార్గదర్శి కావాలి.  ఈ  విషయంలో  మహా యోగి వివేకానంద స్వామి మనకు ఆదర్శం  సంసార జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తున్న  వివేకానందుడు  కాషాయం కట్టిన ప్రతి వారిని  కలిసి వారికి పాద పూజ చేసి ఇదీ నా పరిస్థితి  ఆ భగవత్త్వ స్వరూపాన్ని తెలుసుకుంటే తప్ప నాకు శాంతి లేదు  ఆ మార్గాన్ని నాకు చూపండి అని ఎంత వేడినా ఎవరూ ఆయనకు చెప్పలేకపోయారు. మేమంతా మా కడుపు నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ కాషాయం తప్ప  భగవంతుని చూడాలనే కాంక్షతో కాదు నాయనా  అన్నవారే ఆ సాధు పుంగవులు. చివర ఒక సాధువు అక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నారు  వారు మీ కోసం వెతుకుతున్నారు  ఒక సాధకుడు గురువులను ఎలా వెతుకుతాడో గురువు కూడా  అలా అంటే నిజమైన శిష్యుని కోసం వెతుకుతూనే ఉంటాడు అని మన పెద్దలు చెప్పే వేదాంతం  వెళ్ళాడు  పరమహంస చేత చెంప దెబ్బతిన్నాడు  తనలో  ఉన్న చీకటి మొత్తం మటుమాయమై  ఈ ప్రపంచం మొత్తానికి భారత దేశంలో ఉన్న గొప్పతనాన్ని  వెలుగును ఎలా చూయిస్తుందో చెప్పడానికి కంకణం కట్టుకొని  జీవిత పర్యంతం దానికోసం కృషి చేసిన మహాయోగి  అలా వెతుకుతూ  వెతుకుతూ ఉన్నప్పుడు తప్పకుండా  భగవత్ దర్శనం జరుగుతుంది అన్న విషయాన్ని వేమన  స్పష్టంగా చెప్పిన ఆటగా రెడ్డి పద్యాన్ని ఒక్కసారి చదవండి  మీకు అర్థమవుతుంది.


"వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుండు 
వెదుకుదువని దాను వెతుకుచుండుకు  
వేడుక నేర్చినెట్టి వెరవర్లు గలరురకో..."  కామెంట్‌లు