మానవుడు సౌందర్య పిపాసి అత్యద్భుతమైన సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఆ క్షణాన వచ్చే రంగురంగుల మేఘాలలో చూస్తూ మరీ మురిసి తన్మయత్వంతో తనకే తెలియని అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. అలాంటివాడు అడవులలోకి కానీ, పర్వతాల వద్దకు కాని వెళ్లినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యం ఎంత నిర్మలంగా స్వచ్ఛంగా చక్కటి గాలిని ఇస్తూ చూడడానికే కాదు అనుభవించడానికి కూడా ముచ్చటగా ఉంటుంది. అక్కడ తిరుగాడే జంతుజాలాన్ని చూసినప్పుడు మనస్సు పులికించకమానదు ప్రత్యేకించి లేడీ జింక ఎగురుకుంటూ, ఎగురుకుంటూ వస్తూ చిన్న వాటితో ఆడుకుంటూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. రకరకాల జంతుజాలంతో పాటు రకరకాల పక్షులను చూస్తూ ఎంత సేపైనా ఆదమరిచి ఉండగలం.
సమాజంలో ఏ కుటుంబం అయినా సంస్కారయుతంగా వారి పనులు వారు చేసుకుంటూ ఇతరులకు కూడా సహకరించే వ్యక్తులను చూసి ప్రతి ఒక్కరూ వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. వారి ఇంటికి వెళ్లి చూసిన పెద్దలను ఎంత అందంగా వీరిని ఆహ్వానిస్తారో పిల్లలు కూడా అంత ఆనందంగా వారికి దగ్గరగా వచ్చి సకల మర్యాదలు చేస్తారు. అలా ఉన్నప్పుడు ఎవరికైనా ఆ ఇంటికి వెళ్లాలని ఆ కుటుంబంతో కొంచెం సేపైనా సరదాగా కాలక్షేపం చేయాలని అనుకోవడం సహజం పెద్దలు ఎలా పెంచితే పిల్లలు అలా తయారవడం సహజం చిన్నతనం నుంచి మన అలవాట్లు సంప్రదాయాలు పండుగలు నియమ నిబంధనలను తెలియజేస్తే వాడు ఉత్తమ పౌరులుగా తయారై తమకే కాక సమాజానికి కూడా ఉపయోగపడే పనులను చేస్తూ తిరుగుతూ ఉంటారు.
అలాకాకుండా చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని ఇచ్చే అడవిలో ఒక చెట్టు బాగా ఎండిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిన దాని గాలి రాపిడి వల్ల అగ్ని ఆవిర్భవించి ఆచెట్టు మొత్తం కాలిపోతుంది అది అంతటితో ఆగిపోదు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న మిగిలిన చెట్లకు కూడా వ్యాపించి వాటిని కూడా తుద ముట్టిస్తుంది అలా దావానలం వ్యాపించిన ప్రాంతం స్మశానంగా తయారవుతుంది. అలాగే ఉన్నత కుటుంబంలో ఎవరైనా ఒక నీచుని గురించి చెడుగా చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఎంతో సహజంగా జరుగుతూ ఉంటాయి అని వేమన చెపుతున్నాడు మరి వారు చెప్పిన ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"ఎండిన మ్రానొకటడవిని వుండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను చండాలుండొకడు బు
ట్టి చదువురు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి